Fixed Deposits | వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్యాంక్ తన కస్టమర్లకు అదిరే శుభవార్త అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఇది ఏ బ్యాంక్, ఎంత వడ్డీ రేట్లు పెంచిందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాంక్ 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్డీలపై 3.25 శాతం వడ్డీని అందిస్తోంది. 46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్డీలపై 4.25 శాతం వడ్డీని అందుబాటులో ఉంచింది. 180 రోజుల నుంచి 270 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.95 శాతం, 270 రోజుల నుంచి ఏడాది ఎఫ్డీలపై వడ్డీ రేటు 5.05 శాతం వడ్డీని అందిస్తోంది. ఏడాది నుంచి 18 నెలల ఎఫ్డీలపై వడ్డీ రేటు 6.6 శాతంగా ఉంది.
నైని 2023 డిపాజిట్ స్కీమ్‌పై అయితే 7.05 శాతం వడ్డీ రేటు ఉంది. కాలబుల్ ఆప్షన్‌కు ఇది వర్తిస్తుంది. అదే నాన్ కాలబుల్ ఆప్షన్ అయతే 7.1 శాతం వడ్డీ రేటు పొందొచ్చు. ఇక స్కీమ్ మెచ్యూరిటీ కాలం 705 రోజులు. అలాగే సీనియర్ సిటిజన్స్‌కు అయితే వడ్డీ రేటు 0.5 శాతం ఎక్కువగా ఉంటుంది. అదే సూపర్ సీనియర్ సిటిజన్స్‌కు అయితే 0.6 శాతం అధిక వడ్డీ లభిస్తుంది.