Free Petrol: బంపరాఫర్.. ఆ పేరు ఉన్నవారందరికీ ఫ్రీగా రూ. 501 పెట్రోల్.. ఎక్కడంటే
Free Petrol: బంపరాఫర్.. ఆ పేరు ఉన్నవారందరికీ ఫ్రీగా రూ. 501 పెట్రోల్.. ఎక్కడంటే
పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో ఓ పెట్రోల్ బంక్ యజమాని వాహనదారులకు బంపరాఫర్ ఇచ్చారు. ఫ్రీగా రూ. 501 విలువైన పెట్రోల్ అందించనున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు..
దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లీటరు ధర రూ. 100 దాటడంతో ప్రజలు బైక్ ను బయటకు తీయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. (Image credit : Ani)
2/ 14
ధరలు ఇలానే పెరుగుతూ పోతూ ఉంటే సామాన్యుడు సొంత వాహనాన్ని భరించడం చాలా కష్టమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 14
అయితే ఇలాంటి సమయంలో కొందరు వివిధ వేడుకల సందర్భంగా ఉచితంగా పెట్రోల్ అందించి కొందరికైనా ఊరట కలిగిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 14
ఇటీవల తెలంగాణలో మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాయకులు కొందరు వాహనదారులకు లీటరు పెట్రోల్ చొప్పున ఉచితంగా అందించారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 14
తాజాగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ పెట్రోల్ బంక్ యజమాని ఆయూబ్ పఠాన్ వాహనదారులకు రూ. 501 విలువైన పెట్రోల్ ను ఉచితంగా కొట్టించాడు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 14
టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై అభిమానం చాటుకునేందుకు ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.(PC: Instagram/Neeraj)
7/ 14
నీరజ్ పేరు ఉన్న వారందరికీ రూ.501 విలువైన ఉచిత పెట్రోల్ కొట్టించి వార్తల్లోకి ఎక్కి సంచలనం సృష్టించాడు ఆ వ్యాపారి. (PC: Olympics)
8/ 14
భారుచ్ జిల్లా నేత్రంగ్-మోవి రోడ్డులోని తన ఎస్పీ పెట్రోల్ బంక్ లో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆఫర్ ను అందుబాటులో ఉంచాడు ఆ వ్యాపారి.(SAI Media/Twitter)
9/ 14
నీరజ్ పేరు ఉన్న వ్యక్తులు ఆధార్ కార్డు జిరాక్స్ తో వెళ్తే ఉచితంగా రూ. 501 విలువైన పెట్రోల్ కొట్టించారు. దీంతో పాటు వారికి పుష్పగుచ్ఛం సైతం ఇచ్చి తన అభిమానాన్ని చాటారు. (PC: Instagram/Neeraj)