1. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు భారీగా రిటర్న్స్ ఇస్తాయి అని అంటుంటారు. రిటర్న్స్ ఎలా ఉంటాయో రిస్క్ కూడా అలాగే ఉంటుంది. సాధారణంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు రెండింతలు కావడానికి మూడు నాలుగేళ్ల సమయం పడుతుంది. రిస్క్ కూడా ఉంటుంది. మంచి స్టాక్స్‌లో పెట్టుబడి పెడితేనే మంచి రిటర్న్స్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. కానీ ఇటీవల మల్టీబ్యాగర్ స్టాక్స్ వార్తల్లోకి వస్తున్నాయి. తక్కువ టైమ్‌లోనే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ అనేకం ఉన్నాయి. ఇప్పుడు అలాంటి మరో స్టాక్ ఇన్వెస్టర్లలో హట్ టాపిక్‌గా మారింది. ఆ స్టాక్‌లో మూడు నెలల క్రితం కేవలం రూ.1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.2.5 కోట్లు దాటింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. తక్కువ కాలంలో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ ఇదే. ఆ కంపెనీ పేరు ఎస్ఈఎల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ. 2021 అక్టోబర్ 27న ఒక షేర్ ధర కేవలం 35 పైసలు మాత్రమే. 2022 జనవరి 21న ఈ షేర్ ధర రూ.87.45. కేవలం మూడు నెలల్లో 24,900 శాతం పెరిగిన స్టాక్ ఇది. ఇన్వెస్టర్లకు అతి తక్కువ కాలంలో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ ఇది. (ప్రతీకాత్మక చిత్రం)
4. గత వారం ఐదు సెషన్స్‌లో 5 శాతం అప్పర్ సర్క్యుట్‌లో ఈ స్టాక్ లాక్ అయింది. కేవలం ఐదు సెషన్లలోనే 21.50 శాతం రిటర్న్స్ వచ్చాయి. ఈ ఏడాదిలోనే ఎస్ఈఎల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ షేర్ ధర రూ.44.40 నుంచి రూ.87.45 ధరకు చేరుకుంది. అంటే ఈ షేర్ జనవరిలోనే ఇన్వెస్టర్లకు 97 శాతం రిటర్న్స్ ఇవ్వడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
5. గతేడాది మాత్రమే కాదు... ఈ ఏడాది కూడా మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్ జాబితాలో ఈ కంపెనీ కూడా చేరింది. గత రెండు నెలల్లో ఈ షేర్ రూ.27.45 నుంచి రూ.87.45 ధరకు చేరుకొని 220 శాతం రిటర్న్స్ వచ్చాయి. ఇక మూడు నెలల్లో చూస్తే 35 పైసల నుంచి రూ.87.45 ధరకు చేరుకోవడం విశేషం. ఏకంగా 250 రెట్లు ఈ షేర్ పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. వారం క్రితం ఈ షేర్లో రూ.1,00,000 ఇన్వెస్ట్ చేసినవారికి రూ.1,21,000 రిటర్న్స్, ఈ ఏడాది ప్రారంభంలో రూ.1,00,000 ఇన్వెస్ట్ చేసినవారికి రూ.197,000 రిటర్న్స్, నెల రోజుల క్రితం రూ.1,00,000 ఇన్వెస్ట్ చేసినవారికి రూ.3,20,000 రిటర్న్స్, మూడు నెలల క్రితం రూ.1,00,000 ఇన్వెస్ట్ చేసినవారికి రూ.2.50 కోట్ల రిటర్న్స్ చొప్పున వచ్చాయి. అతి తక్కువ కాలంలో ఈ కంపెనీ ఇన్వెస్టర్లను కోటీశ్వరుల్ని చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఎస్ఈఎల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ గురించి చూస్తే ఇది టెక్స్టైల్ కంగ్లామరేట్ అంటే పలు టెక్స్టైల్ కంపెనీల సమ్మేళనం. స్పిన్నింగ్, నిట్టింగ్, యార్న్స్, ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్ లాంటి కార్యకలాపాల్లో ఉంది. టెర్రీ టవల్స్ నుంచి రెడీమేడ్ గార్మెంట్స్ వరకు అనేక టెక్స్టైల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)