ఇంకా యూటీఐ, నిప్పాన్ ఇండియా, కోటక్, ఆదిత్య బిర్లా వంటి ఫండ్ హౌస్‌లు కూడా 4.93 శాతం నుంచి 7.7 శాతం వరకు మొత్తాన్ని ఐసీఐసీఐ స్టాక్‌లో పెట్టాయి. డీఎస్పీ, ఫ్రాంక్లిన్, టాటా, కెనరా రుబెకో, ఎల్అండ్టీ, సుందరం, ఇన్వెస్కో, ఐడీఎఫ్సీ, మోతీలాల్ ఓస్వాల్, పీజీఐఎం ఇండియా, బరోడా మ్యూచువల్ ఫండ్, ఎడిల్వీస్, హెచ్ఎస్బీసీ, ఎల్ఐసీ ఎంఎఫ్, ఐఐఎఫ్ఎల్ ఇలా చాలా వాటికి ఐసీఐసీఐ లార్జెస్ట్ బెట్ స్టాక్‌గా కొనసాగుతోంది.
కేవలం ఫండ్ హౌస్‌లకు మాత్రమే కాకుండా మార్కెటలో చాలా వరకు పీఎంఎస్ ఫండ్స్‌కు, బ్రోకరేజ్‌లకు కూడా ఐసీఐసీఐ హాట్ ఫేవరెట్ స్టాక్గానే ఉంది. దాదాపు 39 మంది అనలిస్ట్‌లు ఈ స్టాక్‌ను కొనొచ్చని బై రేటింగ్ ఇచ్చారు. వీరి ప్రకారం స్టాక్ యావరేజ్ టార్గెట్ ప్రైస్ రూ. 1015గా ఉంది. గరిష్ట టార్గెట్ ప్రైస్ రూ. 1225.