Top 10 Selling Cars: ఈ 10 కార్లకు యమ క్రేజ్.. జనాలు ఎగబడి కొనేస్తున్నారు!
Top 10 Selling Cars: ఈ 10 కార్లకు యమ క్రేజ్.. జనాలు ఎగబడి కొనేస్తున్నారు!
Top 10 Cars | కొత్తగా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏ కారు కొనుగోలు చేయాలో తెలియడం లేదా. అయితే జనాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్న టాప్ సెల్లింగ్ కార్లు ఏంటివో తెలుసుకోండి. వీటిల్లో మీకు నచ్చిన కారు ఎంచుకోవచ్చు.
Best Selling Cars | అక్టోబర్ నెలతో పండగ సీజన్ అయిపోయింది. పండుగ సీజన్ కారణంగా కార్ల అమ్మకాలు కూడా భారీగా నమోదు అయ్యాయి. దాదాపు అన్ని కంపెనీల కార్ల అమ్మకాల్లోనూ పెరుగుదల నమోదు అయ్యింది. అయితే గత నెలలో టాప్ 10 సెల్లింగ్ కార్లు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.
2/ 11
మారుతీ అల్టో కారు అగ్రస్థానంలో నిలిచింది. ఈ కారు అమ్మకాలు 21,260 యూనిట్లుగా నమోదు అయ్యాయి. అమ్మకాలు వార్షికంగా చూస్తే 22 శాతం పెరిగాయి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన అల్టో కే10 ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
3/ 11
వేగనార్ అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. ఈ కారు అమ్మకాలు 17,945 యూనిట్లుగా ఉన్నాయి. వార్షికంగా చూస్తే ఈ కారు అమ్మకాల్లో ఏకంగా 45 శాతం పెరుగుదల కనిపించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 12,335 యూనిట్లుగా ఉన్నాయి.
4/ 11
మారుతీ సుజుకీ స్విఫ్ట్ కారు కూడా దుమ్మురేపింది. ఈ కారు అమ్మకాలో అక్టోబర్ నెలలో 17,231 యూనిట్లుగా ఉన్నాయి. వార్షికంగా చూస్తే 88 శాతం పెరుగుదల నమోదు అయ్యింది. సీఎన్జీ వేరియంట్ తీసుకురావడం ఇందుకు కారణం.
5/ 11
మారుతీ బాలెనో కార్ల అమ్మకాలు కూడా 17,149 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే నెలలో ఈ మోడల్ అమ్మకాలు రూ. 15,573 యూనిట్లుగా నమోదు అయ్యాయి.
6/ 11
టాటా నెక్సన్ కారు అమ్మకాలు 13,767 యూనిట్లు ఉన్నాయి. టాప్ 10 కార్లలో స్థానం దక్కించుకున్న తొలి టాటా కారు ఇదే. ఈ ఎస్యూవీ కారు అమ్మకాలు గత ఏడాది ఇదే నెలలో 10,096 యూనిట్లుగా ఉన్నాయి. అంటే కారు అమ్మకాలు 36 శాతం పెరిగాయని చెప్పుకోవచ్చు.
7/ 11
మారుతీ సుజుకీ డిజైర్ కారు అమ్మకాలు వార్షికంగా 53 శాతం పెరిగాయి. గత నెలలో అమ్మకాలు 12,321 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 8077 యూనిట్లుగా నమోదు అయ్యాయి.
8/ 11
హ్యుందాయ్ క్రెటా కారు అమ్మకాలు కూడా పెరిగాయి. ఈ కారు అమ్మకాలు 11,880 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే నెలలో కారు అమ్మకాలు 6455 యూనిట్లు. అంటే కారు అమ్మకాలు ఏకంగా 84 శాతం పైకి కదిలాయి.
9/ 11
టాటా పంచ్ కారు అమ్మకాలు కూడా పెరిగాయి. ఈ కారు అమ్మకాలు 10,982 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే నెలలో కారు విక్రయాలు 8453 యూనిట్లు.
10/ 11
అయితే మారుతీ సుజకీ ఎర్టిగా కారు అమ్మకాలు మాత్రం తగ్గాయి. 10,494 యూనిట్లుగా నమోదు అయ్యాయి. అయినా కూడా టాప్ 10లో స్థానం దక్కించుకుంది.
11/ 11
ఇక మారుతీ సుజుకీ వితారా బ్రెజా అమ్మకాలు కూడా పెరిగాయి. ఈ కారు అమ్మకాలు 24 శాతం పైకి చేరాయి. 9941 యూనిట్లు నమోదు అయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 8032 యూనిట్లుగా ఉన్నాయి.