భవిష్యత్తు అవసరాల కోసం ఎంతో కొంత నగదును పెట్టుబడులు పెట్టాలని అందరూ భావిస్తారు. తమ పెట్టుబడులకు భద్రత ఉండాలని కోరుకొంటారు. కష్టార్జితాన్ని సురక్షితంగా పెట్టుబడి పెట్టాలనుకొనే వారికి కనిపించే మొదటి మార్గం మ్యూచువల్ ఫండ్స్. నష్టభయం ఎక్కువ లేకుండా ఇవి స్థిరమైన లాభాలను అందిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఏ మ్యూచువల్ ఫండ్స్ ప్రస్తుతం మార్కెట్లో మంచి లాభాలను అందిస్తున్నాయో గుర్తించి, డబ్బు పెట్టుబడి పెడితే మంచిది. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్(ELSS) మూడేళ్ల కాలపరిమితితో అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీముల ద్వారా ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు పెట్టుబడులపై పన్ను రాయితీని పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

BOI AXA Tax Advantage ప్లాన్ మూడేళ్లుగా ఏటా 22.4 శాతం కాంపౌండ్ యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అందిస్తోంది. దాదాపు రూ.546 కోట్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులను నిర్వహిస్తోంది. కొన్ని పెద్ద సంస్థలు ఇందులో స్టాక్స్‌ను హోల్డ్ చేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 6.5 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4.5 శాతం, ఇన్ఫోసిస్ 4.3 శాతం, బజాజ్ ఫైనాన్స్ 4.0 శాతం, చోలమండలం ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ అండ్ కంపెనీ 2.4 శాతం, రియలన్స్ ఇండస్ట్రీస్ 2.4 శాతం స్టాక్స్‌ను హోల్డ్ చేస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
కెనరా రెబెకో ఈక్విటీ ట్యాక్స్ సేవర్(Canara Rebeco Equity Tax Saver) ఫండ్ మూడేళ్లుగా 18.5 శాతం కాంపౌండ్ యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అందిస్తోంది. ఇన్వెస్టర్లు పెట్టుబడిగా పెట్టిన దాదాపు రూ.3,209 కోట్లను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో పలు రంగాలకు చెందిన పెద్ద పెద్ద కంపెనీలు స్టాక్స్‌ను హోల్డ్ చేస్తున్నాయి. ఇన్ఫోసిస్ 7.7 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 7.5 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 7.1 శాతం, లార్సెన్ అండ్ టర్బో 4.5 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 4 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.7 శాతం స్టాక్స్‌ను హోల్డ్ చేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
మిరాయి అస్సెట్ ట్యాక్స్ సేవర్(Mirae Asset Tax Saver) మూడేళ్ల నుంచి 18.2 శాతం కాంపౌండ్ యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అందిస్తోంది. ఇన్వెస్టర్లకు చెందిన దాదాపు రూ.10,972 కోట్ల పెట్టుబడులను నిర్వహిస్తోంది. ఇందులో హెచ్డీఎఫ్సీ బ్యాంకు 7.8 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 7.7 శాతం, ఇన్ఫోసిస్ 7.4 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 5.0 శాతం, యాక్సిస్ బ్యాంక్ 4.6 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4.1 శాతం స్టాక్స్‌ను హోల్డ్ చేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఐడీఎఫ్సీ ట్యాక్స్ అడ్వాంటేజ్(IDFC Tax Advantage) ఫండ్ మూడేళ్లుగా 17.5 శాతం కాంపౌండ్ యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అందిస్తోంది. దాదాపు రూ.3,583 కోట్ల రూపాయలను నిర్వహిస్తోంది. ఇందులో ఆయా విభాగాల్లో టాప్‌లో ఉన్న సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. అందులో ఐసీఐసీఐ బ్యాంక్ 8.1 శాతం, ఇన్ఫోసిస్ 6.8 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.4 శాతం, టాటా మోటార్స్ 4 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 3.9 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.7 శాతం స్టాక్స్‌ను హోల్డ్ చేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)