హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీ పేరుతో ప్రత్యేకమైన ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని అందిస్తోంది. 2020 మే 18 నుంచి ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. అయితే వచ్చే నెల నుంచి ఈ పథకం ఉండదు. ఈ పథకంలో చేరిన వారికి 0.5 శాతం ఎక్కువ వడ్డీ కాకుండా, అదనంగా 0.25 శాతం అధిక వడ్డీ పొందొచ్చు. అంటే ఈ స్కీమ్‌లో చేరితే కస్టమర్లకు 7.75 శాతం వ్డడీ వస్తుంది.
ఇక చివరిగా పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ కూడా అ 4దిరే స్కీమ్స్ అందుబాటులో ఉంచింది. దీని పేరు పీఎస్బీ ఫ్యాబులస్ 300 డేస్, పీఎస్బీ ఫ్యాబులస్ ప్లస్ 601 డేస్, పీఎస్బీ ఇఅడ్వాంటేజ్ ఫిక్స్డ్ డిపాజిట్, పీఎస్బీ ఉత్కర్ష్ 222 డేస్ అనేవి ఇవి. ఈ స్కీమ్స్ మార్చి 31 వరకే అందుబాటులో ఉంటాయి. వీటిల్లో చేరితే 8.6 శాతం వరకు వడ్డీ వస్తుంది.