1. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పొదుపు పథకాల్లో (Savings Schemes) డబ్బులు దాచుకున్నవారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వం రాబోయే మూడు నెలలకు సంబంధించిన వడ్డీ రేట్లను (Interest Rates) భారీగా పెంచింది. పొదుపు పథకాన్ని బట్టి 20 బేసిస్ పాయింట్స్ నుంచి 110 బేసిస్ పాయింట్స్ వరకు వడ్డీ రేట్లు పెంచడం విశేషం. 100 బేసిస్ పాయింట్స్ 1 శాతంతో సమానం. 2023 జనవరి నుంచి మార్చి వరకు కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేంద్ర ప్రభుత్వం 2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి కూడా 30 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. అంతకుముందు వరుసగా తొమ్మిది త్రైమాసికాలు వడ్డీ రేట్లను పెంచలేదు. అంటే రెండేళ్ల మూడు నెలలు వడ్డీ రేట్లను పెంచలేదు. ఇప్పుడు వరుసగా రెండు త్రైమాసికాల్లో వడ్డీ రేటు పెంచడం విశేషం. ఏ పథకానికి వడ్డీ ఎంత పెరిగిందో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. సేవింగ్స్ డిపాజిట్‌కు వడ్డీలో ఎలాంటి మార్పు లేదు. వార్షిక వడ్డీ 4 శాతం కొనసాగుతుంది. 1 ఏడాది టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 110 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 5.5 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగింది. 2 ఏళ్ల టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 110 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 5.7 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. 3 ఏళ్ల టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 110 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 5.8 శాతం నుంచి 6.9 శాతానికి పెరిగింది. 5 ఏళ్ల టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 30 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 6.7 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు. 5.8 శాతం కొనసాగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు 40 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 7.6 శాతం నుంచి 8 శాతానికి వడ్డీ పెరిగింది. మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్ వడ్డీ రేటు 40 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 6.7 శాతం నుంచి 7.1 శాతానికి వడ్డీ పెరిగింది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 6.8 శాతం నుంచి 7 శాతానికి వడ్డీ పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)