ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్లపై 6.5 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. కస్టమర్ వారి సేవింగ్స్ ఖాతాలో రూ. 1 లక్ష కంటే ఎక్కువ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తే 6.5 శాతం వడ్డీ లభిస్తుంది. మరోవైపు, రూ. 1 లక్ష వరకు బ్యాలెన్స్‌పై 4 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై 6.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే, ఈ బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ రూ. 2,000 మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. తక్కువ వడ్డీతో పాటు మొబైల్, ఇంటర్నెట్, బ్యాంకింగ్, డెబిట్ కార్డులపై కస్టమర్లకు అనేక ఆఫర్లు కూడా అందిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్..
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తన కస్టమర్లకు సేవింగ్స్ డిపాజిట్లపై 6 శాతం వరకు వడ్డీని అందిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ఈ బ్యాంక్‌ని షెడ్యూల్డ్ బ్యాంక్‌గా మార్చింది. ఏ కస్టమర్ అయినా పేపర్‌లెస్ విధానంలో కేవలం 5 నిమిషాల్లోనే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మరోవైపు. నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా సేవింగ్స్ ఖాతా కస్టమర్లకు 6 శాతం వరకు వడ్డీని అందిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)