ముఖ్యంగా మహమ్మారి తర్వాతి కాలంలో మదుపరులకు పెద్దమొత్తంలో సంపాదించి పెట్టాయి. దీర్ఘకాలం రాబడులు కోసం ఫండ్ మేనేజర్ల(Fund Managers)ను సైతం ఇవి బాగా ఆకర్షిస్తున్నాయి. ఆయా రంగాల్లో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ లాభాల(funds Profits) బాట పట్టాయి. గత రెండేళ్లలో(మార్చి 2020 కనిష్ఠ స్థాయి నుంచి) 280 శాతం వరకు రాబడులను అందుకున్నాయి. వీటిలో టాప్-10 సెక్టార్, థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ ఏవో చూద్దాం(2022 జనవరి 31 వరకు ఫోర్ట్ ఫోలియో విలువ).(ప్రతీకాత్మక చిత్రం)
2020 మార్చి కనిష్ఠ స్థాయి నుంచి 2022 ఫిబ్రవరి 29 వరకు రెండు సంవత్సరాల రాబడి 278 శాతం పెరిగింది. దేశీయ టెక్నాలజీ, స్టాక్‌తో పాటు ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ సహా అమెరికాలోని పెద్ద టెక్ దిగ్గజాలకు ఐసీఐసీఐ ప్రూ(ICICI Pru) టెక్నాలజీ ఫండ్ దాదాపు 10 శాతం కేటాయించింది. ఫలితంగా మొత్తం రాబడిని పెంచడంలో సహాయపడింది.(ప్రతీకాత్మక చిత్రం)
ఎస్బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్.. ఈ రెండేళ్ల కాలంలో 188 శాతం రాబడులను అందుకుని ఐదో స్థానంలో నిలిచింది. మైక్రోసాఫ్ట్ కార్ప్, నెట్‌ఫ్లిక్స్, ఆల్ఫాబెట్ ఇంక్ లాంటి సంస్థలకు ఈక్విటీలను కేటియించింది. అంతేకాకుండా గతేడాది కాలంలో మిడ్ క్యాప్ ఐటీ పరిధిలో 20 నుంచి 25 శాతం కేటాయింపులు చేసి మంచి రిటర్నులను తెచ్చిపెట్టింది. (ప్రతీకాత్మక చిత్రం)