Bank FD Rates | ఆర్బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు కూడా వరుస పెట్టి వడ్డీ రేట్లు పెంచుకుంటూ వస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై రేట్లను పెంచేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు రేట్లు పెంచేశాయి. ఇప్పుడు మళ్లీ మరో నాలుగు బ్యాంకులు ఎఫ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచేసింది. రూ. 2 కోట్లలోపు ఎఫ్డీలకు ఇది వర్తిస్తుంది. ఇప్పటికే రేట్ల పెంపు అమలులోకి వచ్చింది. బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి ఇప్పుడు 3.75 శాతం నుంచి 7.2 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. 7 రోజుల నుంచి పదేళ్ల టెన్యూర్‌తో డబ్బులు దాచుకోవచ్చు.
ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు పెంచింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం చూస్తే.. ఎఫ్డీ రేట్లు 20 బేసిస్ పాయింట్ల మేర పెరిగాయి. బ్యాంక్ కస్టమర్లకు 3.5 శాతం నుంచి 6.5 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు గరిష్టంగా 7.25 శాతం వరకు వడ్డీ వస్తుంది.