ఇక చివరిగా ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో చౌక వడ్డీకే గోల్డ్ లోన్స్ లభిస్తున్నాయి. ఈ బ్యాంక్లో వడ్డీ రేటు 7.60 నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్టంగా 16.81 శాతం వరకు వడ్డీ పడొచ్చు. ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంలో 1 శాతంగా ఉంటుంది. ఈ బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే రుణం పొందొచ్చు. ఎస్బీఐలో కూడా వడ్డీ రేటు తక్కువగానే ఉంటుంది. ఇంకా కెనరా బ్యాంక్లో కూడా అందుబాటు రేటులోనే గోల్డ్ లోన్స్ పొందొచ్చు. కాగా గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల్లో మాత్రం వడ్డీ ఎక్కువగా ఉంటుంది.