ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన డీసీబీ బ్యాంక్ ఎఫ్డీ రేట్లు పెంచేసింది. రూ. 2 కోట్లలోపు ఎఫ్డీలకు ఇది వర్తిస్తుంది. ఇప్పటికే రేట్ల పెంపు అమలులోకి వచ్చింది. బ్యాంక్ ఇప్పుడు 3.75 శాతం నుంచి 7.85 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 4.25 శాతం నుంచి 8.35 శాతం వరకు వడ్డీ వస్తుంది.
అలాగే సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచేసింది. ఈ బ్యాంక్ కూడా రూ. 2 కోట్ల లోపు ఎఫ్డీలపై రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ బ్యాంక్ 7 రోజుల నుంచి పదేళ్ల టెన్యూర్‌లోని ఎఫ్డీలపై 4 శాతం నుంచి 8.51 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. రెగ్యులర్ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 8.76 శాతం వరకు వడ్డీ వస్తుంది.