భారత దేశం లో పెట్రోల్ ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. కానీ, మిగతా దేశాలతో పోల్చి చూసినప్పుడు మాత్రం ఈ పెట్రోల్ రేటు అధికంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఇక్కడ చెప్పే దేశాల్లో పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నీళ్ల కంటే కూడా ఇక్కడ పెట్రోల్ రేట్లు అత్యంత చౌకగా ఉంటాయి. ఆ దేశాల వివరాల్లోకి వెళ్తే.. (ప్రతీకాత్మక చిత్రం)
వెనిజులా .. దక్షిణ అమెరికా ఖండంలో ఈ దేశం ఉంటుంది. ప్రపంచంలో అత్యంత చౌకగా ఈ దేశంలో పెట్రోల్ లభిస్తుంది. ఇక్కడ ఒక లీటరు పెట్రోల్ ధర 0.031 డాలర్ మాత్రమే. అంటే మన కరెన్సీలో లీటరు పెట్రోల్ రూ. 2.45 మాత్రమే. ఈ దేశంలో 50 శాతం ఆర్థిక వ్యవస్థ అనేది ఈ పెట్రోల్ ఎగుమతులపైనే ఆధారపడి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
సౌదీ అరేబియా
ఈ ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో సౌదీ కూడా ఒకటి. పెట్రోల్ ను ఈ దేశం అధికంగా ఎగుమతి చేస్తూ.. తమకు కావాల్సిన వస్తువులను ఇతర దేశాల నుంచి దిగమతి చేసుకుంటుంది. అయితే సౌదీ అరేబియాలో ఒక లీటర్ పెట్రోల్ ధర 0.621 డాలర్ అంటే మన డబ్బులో చూసినట్లయితే 49 రూపాయల 7 పైసలు ఉంటుంది.
కతర్
పెట్రోల మన దేశం కంటే అత్యంత తక్కువగా లభించే దేశాల్లో కతర్ కూడా ఒకటి. ఈ దేశానికి ఈ పెట్రోల్ పైనే ఎక్కువగా ఆదాయం వస్తుంటుంది. ఈ దేశం లో ఒక లీటర్ పెట్రోల్ ధర 0.577 డాలర్, అంటే మన దేశపు డబ్బులో 45 రూపాయలు. ఇంకా తక్కువగా పెట్రలో లభించే దేశాల్లో బహరేన్ ఇక్కడ లీటరు పెట్రోల్ రూ.40.50 పైసలు. (ప్రతీకాత్మక చిత్రం)