1. పాన్ కార్డ్ ఉన్నవారు తమ ఆధార్ నెంబర్ లింక్ (PAN Aadhaar Link) చేయాలని ఆదాయపు పన్ను శాఖ పదేపదే కోరుతున్న సంగతి తెలిసిందే. గతంలో చాలాసార్లు గడువు కూడా పొడిగించింది. ఆ గడువు 2022 మార్చి 31న ముగిసింది. అయితే జరిమానా చెల్లించి 2023 మార్చి 31 వరకు పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. అంటే ఈ నెలాఖరులోగా పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలి. అప్పట్లోగా పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే ఆ తర్వాత అంటే 2023 ఏప్రిల్ 1 నుంచి ఆ పాన్ కార్డ్ చెల్లదు. దీంతో పాన్ కార్డ్ హోల్డర్స్ పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు (Financial Transcations) జరిపేవారికి చిక్కులు తప్పవు. ప్రధానంగా 5 సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. పాన్ కార్డ్ ఇనాపరేటీవ్గా మారుతుంది కాబట్టి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడం కుదరదు. ఇప్పటికే ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేసినా, పెండింగ్లో ఉన్న రిటర్న్స్ ప్రాసెస్ కావు. ఇక గతంలోనే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి రీఫండ్స్ కోసం ఎదురుచూస్తున్నట్టైతే పెండింగ్ రీఫండ్స్ రావు. ఒక్కసారి పాన్ ఇనాపరేటీవ్గా మారినట్టైతే డిఫెక్టీవ్ రిటర్న్స్ విషయంలో పెండింగ్లో ఉన్న ప్రొసీడింగ్స్ కూడా చేయబడవు. (ప్రతీకాత్మక చిత్రం)
4. పాన్ కార్డ్ ఇనాపరేటీవ్గా మారుతుంది కాబట్టి ఎక్కువ రేట్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ సమస్యలు ఉంటాయి కాబట్టి వీలైనంత త్వరగా పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ లింక్ చేయాలి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మినహాయింపు కేటగిరీ పరిధిలోకి రాని పాన్ కార్డ్ హోల్డర్స్ తప్పనిసరిగా తమ ఆధార్ నెంబర్ను లింక్ చేయాల్సిందేనని ఆదాయపు పన్ను డిపార్ట్మెంట్ చెబుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)