1. ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీరేట్ల పెంపు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి కారణాలతో ఇండియన్ స్టాక్ మార్కెట్ 2022లో ఒడిదొడుకులకు లోనైంది. అయితే ఇతర దేశాల మార్కెట్లతో పోలిస్తే ఇండియన్ స్టాక్ మార్కెట్ సూచీలు మెరుగ్గానే ఉన్నాయి. BSE సెన్సెక్స్, నిఫ్టీ 50 రెండూ 2022లో 7 శాతం వరకు లాభపడ్డాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. సాధారణంగా రూ.10 కంటే తక్కువ ప్రైస్‌తో ట్రేడ్ అవుతున్న పెన్నీ స్టాక్‌లలో రిస్క్ ఎక్కువ ఉంటుందని భావిస్తారు. అయితే 1,000 కంటే ఎక్కువ ప్రాఫిట్స్ అందించిన పెన్నీ స్టాక్స్ గురించి నిపుణులు మాట్లాడుతూ.. ఈ ఏడు కంపెనీలు అనేక త్రైమాసికాల్లో నష్టాలను నమోదు చేశాయన్నారు. కొన్ని సందర్భాల్లో జీరో రెవెన్యూ ప్రకటించాయని చెప్పారు. కానీ ఇవి లాభాలు అందించడానికి గల కారణం.. ప్రైస్ తక్కువగా ఉండటమేనని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. పెట్టుబడిదారులు త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఇలాంటి లో ప్రైస్ స్టాక్‌లలో పెట్టువడి పెడతారని చెప్పారు. ఇలా డిమాండ్ క్రియేట్ అయి స్టాక్ ప్రైస్ పెరుగుతుందని వివరించారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని, నష్టపోయే అవకాశాలే ఎక్కువని తెలిపారు. స్టాక్ ప్రైస్‌ను కాకుండా కంపెనీ బిజినెస్ మోడల్, గ్రోత్ పొటెన్షియల్, ప్రొడక్ట్, సర్వీస్‌ను పరిశీలించాలని మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రశాంత్ తాప్సే అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. భారీ ప్రాఫిట్స్ అందించిన 7 పెన్నీ స్టాక్స్ ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ స్టాక్స్ వివరాలు తెలుసుకోండి. ఈ స్టాక్స్ అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడి కోసం సిఫార్సు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ సలహా తీసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
6. Ashnisha Industries: ఈ కంపెనీ షేరు రూ.0.96 నుంచి రూ.10కి పెరిగింది. 1,000 శాతం అభివృద్ధి నమోదు చేసింది. గత రెండు త్రైమాసికాల్లో కంపెనీ రెవెన్యూ ప్రకటించడం ప్రారంభించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.1.15 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. అంతకు ముందు త్రైమాసికంలో రెవెన్యూ రూ.53 లక్షలుగా ఉంది. సెప్టెంబర్‌లో నికర లాభం రూ.7 లక్షలు ప్రకటించింది. అంతకు ముందు త్రైమాసికంలో రూ.25 లక్షల నికర ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ కంపెనీ స్టీల్ ప్రొడ్యూస్ చేస్తుంది, వ్యాపార, పెట్టుబడి సేవలను అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. Kaiser Corporation: 2022లో అతిపెద్ద మల్టీబ్యాగర్‌గా ఈ కంపెనీ నిలిచింది. ఈ స్టాక్ దాదాపు 1,959 శాతం పెరిగింది. 2022 ప్రారంభంలో ఈ స్టాక్ రూ.2.80 వద్ద ట్రేడవుతోంది.. ప్రస్తుతం రూ.57 వద్ద ఉంది. కంపెనీ వరుసగా రెండో త్రైమాసికంలో నష్టాన్ని నమోదు చేసింది. త్రైమాసికంలో ఆదాయం 50 శాతానికి పైగా క్షీణించింది. సంవత్సరానికి 75 శాతానికి పైగా బలహీనపడింది. మార్చిలో రూ.5.76 కోట్లుగా ఉన్న అప్పు సెప్టెంబర్‌లో రూ.10.43 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ లేబుల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్, మ్యాగజైన్లు, కార్టన్లను ప్రింట్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. KBS India: ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ప్రణాళిక, సెక్యూరిటీల బ్రోకరేజ్ సేవలతో సహా ఫండ్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తుంది. ఈ కంపెనీ షేర్ విలువ సంవత్సరం ప్రారంభంలో రూ.9.50గా ఉంది. ప్రస్తుతం 1,378 శాతం పెరిగి రూ.141కి చేరుకుంది. 2021లో స్టాక్ దాదాపు 140 శాతం లాభపడింది. సంస్థ FY22కి రూ.39 లక్షల నికర లాభాన్ని నివేదించింది. అంతకు ముందు సంవత్సరం రూ.లక్షతో పోలిస్తే రెవెన్యూ రూ.1.86 కోట్లుగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
9. Sonal Adhesives: ఈ కంపెనీ స్టాక్ 1,359 శాతం పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో రూ.9.30 ఉండగా.. ప్రస్తుతం రూ.136 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ కంపెనీ ప్లాస్టిక్ రోప్, టేపులు వంటివి తయారు చేస్తుంది. రెండో క్వార్టర్లో రూ.21.08 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది, అంతకు ముందు ఏడాది ఇదే సమయానికి రూ.13.07 కోట్లు ఆదాయం ఆర్జించింది. నికర లాభం రూ.1.14 లక్షల నష్టం నుంచి రూ.28 లక్షలకు పెరిగింది. రుణాలను ఏడాది క్రితం ఉన్న రూ.27.06 కోట్ల నుంచి 2022 సెప్టెంబర్ నాటికి రూ.3.34 కోట్లకు తగ్గించింది. (ప్రతీకాత్మక చిత్రం)
10. Alliance Integrated Metaliks: ఈ కంపెనీ వంతెనలు, టవర్లకు అవసరమైన మెటల్ ప్రొడక్ట్‌లు తయారు చేస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ షేరు రూ.2.71 వద్ద ఉంది. ప్రస్తుతం 1,578 శాతం లాభపడి రూ.45 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే కంపెనీ వరుసగా 22 త్రైమాసికాల్లో నష్టాలను నమోదు చేసింది. వరుసగా నాలుగో త్రైమాసికంలో కూడా ఆదాయం క్షీణించింది. సెప్టెంబర్‌లో రూ.302.17 కోట్ల రుణభారం రూ.335.82 కోట్లకు పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
11. Hemang Resources: ఈ కంపెనీ బొగ్గు సరఫరాదారు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన సేవలను కూడా అందిస్తుంది. ఏడాది ప్రారంభంలో రూ.3.09గా ఉన్న షేరు ధర.. 1,612 శాతం పెరిగి రూ.53కి చేరుకుంది. గత కొన్ని త్రైమాసికాల్లో ఆదాయం గణనీయంగా పెరగడం, అప్పులు తగ్గడం ఈ జంప్‌కు కారణమని చెప్పవచ్చు. ఏడాది క్రితం జీరో రాబడితో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.86.72 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. జూన్ త్రైమాసికంలో రూ.68.81 కోట్ల ఆదాయాన్ని అందుకుంది. ఇది వరుసగా ఐదో త్రైమాసికంలో నికర లాభాన్ని ప్రకటించింది. 2021 మార్చిలో రూ.21.59 కోట్ల నుంచి సెప్టెంబర్‌లో కంపెనీ తన రుణాన్ని రూ.3.39 కోట్లకు తగ్గించింది. (ప్రతీకాత్మక చిత్రం)
12. Beekay Niryat: ఈ కంపెనీ షేర్ ధర రూ.7 నుంచి రూ.80కి పెరిగింది. ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెడుతుంది, జనపనార, జనపనార ఉత్పత్తులలో వ్యాపారం చేస్తుంది. రుణాలను సిండికేట్ చేస్తుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.2.85 కోట్ల రెవెన్యూ ప్రకటించింది. ఇదే త్రైమాసికంగా అంతకుముందు ఏడాది రూ.19 లక్షలుగా రెవెన్యూ నమోదు చేసింది. చాలా త్రైమాసికాల్లో జీరో రెవెన్యూ ప్రకటించింది. సంవత్సరం క్రితం రుణాలు రూ.67 లక్షలుగా ఉండగా.. సెప్టెంబరు నాటికి రూ.6 కోట్లకు చేరాయి. (ప్రతీకాత్మక చిత్రం)