Indian Railway: రైలు ప్రయాణంలో ఛార్జింగ్ పెడుతున్నారా.. వీటిపై కీలక నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ..
Indian Railway: రైలు ప్రయాణంలో ఛార్జింగ్ పెడుతున్నారా.. వీటిపై కీలక నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ..
రైలు ప్రయాణంలో చాలామంది మొబైల్స్ కు ఛార్జింగ్ పెడుతుంటారు. అయితే ఇలా చేయడంపై రైల్వే శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఛార్జింగ్ పెట్డడం కుదరదని తేల్చి చెప్పేశారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రయాణ సమయంలో ముందుజాగ్రత్త చర్యగా ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను రాత్రిపూట ఛార్జ్ చేయడానికి అనుమతించకూడదని భారతీయ రైల్వే నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
కొన్ని రైళ్లలో అగ్నిప్రమాద ఘటనలు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా రాత్రి వేళల్లో రైళ్లలో మొబైల్ ఛార్జింగ్ సదుపాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు రైల్వే సీనియర్ అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ పెట్టేందుకు ఉపయోగించే పాయింట్లు మూసి ఉంటాయని రైల్వే శాఖ తెలిపింది. ఈ నిర్ణయం ఈనాటిది కాదు.. కొన్నేళ్ల క్రితమే రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
రైల్వే బోర్డు ఈ నిర్ణయాన్ని మార్చి 16, 2021 రోజునే తీసుకుంది. అయితే, ప్రయాణికులకు సమాచారం తెలవకపోవడంతో నేటికీ ప్రజలు తమ ఫోన్లను రాత్రి సమయంలో రైళ్లలో ఛార్జింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
రైలులో చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలపై విడుదల చేసిన నివేదికలో.. రాత్రి సమయంలో మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయడానికి ఉపయోగించే పాయింట్లను స్విచ్ ఆఫ్ చేయాలని అధికారులు సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
చాలా దూరం ప్రయాణించే రైళ్లలో చిన్నపాటి మంటలు చెలరేగడం ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎక్కువ ఛార్జింగ్ పెట్టడం వల్లే సంభవించినట్లు అధికారులు నివేదించారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఫోన్ ఛార్జింగ్ పెట్టడం వల్ల నిద్రలోకి జారుకోవడం, పైగా ఛార్జింగ్ పెట్టడం వల్ల అనేక సమస్యలు తలెత్తడం కనిపిస్తోంది. కాబట్టి రైల్వే నిబంధనల ప్రకారం ప్రజలు రాత్రి సమయంలో మొబైల్కు ఛార్జింగ్ పెట్టకుండా ఉండాలని సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)