Maruti Baleno: మన దేశంలో కారు అనగానే గుర్తొచ్చే కంపెనీ మారుతి సుజుకి, గడిచి కొన్ని దశాబ్దాలుగా మారుతి నుంచి అనేక సక్సెస్ ఫుల్ మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. వాటిలో చాలా మోడల్స్ దశాబ్దాల తరబడి మార్కెట్లో నిలిచాయి. అయితే మారుతి సంస్థనుంచి వచ్చి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న కారు మారుతి సుజుకి బాలెనో.
ఇక ఇంజన్ , పవర్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో కొన్ని ప్రత్యేక మెకానికల్ మార్పులు చూడవచ్చు. ఇందులో 88 bhp పవర్ , 115 Nm టార్క్ ఉత్పత్తి చేయగల 1.2 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గమనించవచ్చు. ఇక 5-స్పీడ్ మాన్యువల్ , CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో మళ్లీ పొందే వీలుంది. దీని వివరాలన్నీ రాబోయే కాలంలో వెల్లడి చేయబడతాయి , బాలెనో ఫేస్‌లిఫ్ట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలలో మార్కెట్లో వచ్చే అవకాశం ఉంది.