పౌల్ట్రీ, డెయిరీ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం తీయటి కబురు చెప్పింది. తెలంగాణలో ఉన్న పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఆస్తి పన్నును మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, మున్సిపల్ శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి వేర్వేరుగా ఆదేశాలు జారీచేశారు. (ప్రతీకాత్మక చిత్రం)