ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) అనేది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అందించే బీమా రక్షణ. దీని ద్వారా ప్రతి ఖాతాదారునికి రూ.7 లక్షల ప్రయోజనం లభిస్తుంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF), ఇతర నిబంధనల చట్టం 1952 కింద కవర్ చేయబడిన అన్ని సంస్థలు EDLI కోసం నమోదు చేయబడతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఖాతాదారుడు ప్రమాదంలో మరణిస్తే ఈ పథకం కింద కుటుంబ సభ్యులు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ స్కీమ్ బీమా డెత్ క్లెయిమ్ చేయవచ్చు. ఈ పథకం కింద ఖాతాదారుడు గరిష్టంగా 7 లక్షల రూపాయల ప్రయోజనాన్ని పొందవచ్చు. రిటైర్ ఫండ్ సంస్థ ఈ ఏడాది జూన్లో 'ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్' (EDLI) పథకం కింద గరిష్ట హామీ ప్రయోజనాన్ని రూ. 7 లక్షలకు పెంచింది. (ప్రతీకాత్మక చిత్రం)