1. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం దాదాపుగా తగ్గిపోవడంతో రెండేళ్లుగా టూర్లను వాయిదా వేసుకున్నవారంతా ఇప్పుడు మళ్లీ బ్యాగులు సర్దుతున్నారు. వేసవి సెలవులు కూడా వచ్చేయడంతో టూర్లకు (Summer Tour) బయల్దేరుతున్నారు. తిరుపతి (Tirupati) లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకు కూడా భక్తుల రాక పెరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. పర్యాటకుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని టూరిజం సంస్థలు పలు టూర్ ప్యాకేజీలను (Tour Packages) అందిస్తున్నాయి. తెలంగాణ టూరిజం కూడా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. అందులో భాగంగా తిరుమల తిరుపతి టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలంగాణ టూరిజం అధికారిక వెబ్సైట్లో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇది రెండు రాత్రులు, ఒక రోజు టూర్ ప్యాకేజీ. మొదటి రోజు టూర్ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటలకు కేపీహెచ్బీలో, సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌లోని యాత్రీ నివాస్‌లో, సాయంత్రం 6.15 గంటలకు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో, సాయంత్రం 7 గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్ఓ ఆఫీసు దగ్గర టూరిస్ట్ బస్సు ఎక్కొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. పర్యాటకులు మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుపతి చేరుకుంటారు. అక్కడ హోటల్లో వసతి సౌకర్యాలు ఉంటాయి. పర్యాటకులు ఫ్రెషప్ అయిన తర్వాత తిరుమలకు బయల్దేరాలి. తిరుమలలో మధ్యాహ్నం 1 గంటకు దర్శనం ఉంటుంది. దర్శనం పూర్తైన తర్వాత సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు ఉదయం తిరుపతికి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. తెలంగాణ టూరిజం అందించే తిరుమల తిరుపతి టూర్ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.3,600, పిల్లలకు రూ.2,880. ఒక రోజులో తిరుపతి వెళ్లి తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఈ ప్యాకేజీలో బస్సులో ప్రయాణం, హోటల్లో వసతి, తిరుమలలో దర్శనం మాత్రమే కవర్ అవుతాయి. ఇతర ఆలయాల సందర్శన కవర్ కావు. (ప్రతీకాత్మక చిత్రం)