ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నా కొద్దీ ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా టెన్షన్ పెరిగింది. మహమ్మారి విజృంభణకు అడ్డుకట్ట వేసేందుకు ఆయా ప్రభుత్వాలు మళ్లీ ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మాస్కుల వినియోగంపై కీలక నిర్ణయం తీసకున్న విషయం తెలిసిందే. మాస్కు లేకుండా బయట తిరిగే వారికి రూ. వేయి ఫైన్ వేయనున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
ప్రతీ బస్సు డ్రైవర్, కండక్టర్ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సజ్జనార్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. శానిటైజర్ బాటిల్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. డిపో నుంచి బస్సులు బయటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.(ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్-ఫైల్ ఫొటో)