కరోనా కష్టాల నుంచి బయటపడుతున్న సామాన్యుడికి మరో షాక్ తగలనుంది. ఆర్టీసీ ఛార్జీలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రంలోగా ఈ అంశంపై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఖైరతాబాద్ లోని రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై సమావేశం నిర్వహిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ పెంపుపై తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది. కరోనా నేపథ్యంలో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించడానికి ఛార్జీల పెంపు మాత్రమే మార్గమని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సామాన్యులు, ప్రతిపక్షాల నుంచి మాత్రం ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
రాష్ట్రలో ఆర్టీసీ ఛార్జీలు పెంచే అవకాశం ఉందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. సంస్థ ఎండీ సజ్జనార్ తో పాటు, చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ సైతం గతంలో ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. నిన్న నల్లగొండ జిల్లాలో పర్యటించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ డీజిల్ ధరలు 30 శాతం పెరగడంతో ఆర్టీసీ బస్సు చార్జీలు కూడా పెంచే ఆలోచన ఉందని చెప్పారు.(ప్రతీకాత్మక చిత్రం)
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు కొన్ని బస్ స్టేషన్లలో యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లింపు సేవలను ప్రవేశ పెట్టారు. క్రమంగా దశల వారీగా అన్ని బస్ స్టేషన్లలో క్యాష్ లెస్ చెల్లింపులు తీసుకురావాలన్నది సంస్థ ఆలోచనగా తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)