Electric Cycle | కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. మార్కెట్లోకి తాజాగా రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంట్రీ ఇచ్చాయి. టెక్ ఇన్నోవేటివ్ మొబిలిటీ అనే కంపెనీ మార్కెట్లోకి రెండు కొత్త ఈవీలను తీసుకువచ్చింది. వీటి పేర్లు ఏ250, యాంబ్లర్. ఇప్పుడు మనం వీటి గురించి తెలుసుకుందాం.
అంతేకాకుండా ఈ మోడల్ గరిష్ట స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. మెటాలిక్ గ్రే, గ్లాసీ వైట్ కలర్స్‌లో ఇది అందుబాటులో ఉంది. 0 నుంచి 100 శాతం చార్జింగ్ ఎక్కడానికి 3 గంటలు పడుతుంది. స్టోరేజ్ కెపాసిటీ 20 లీటర్లు. డీటాచబుల్ బ్యాటరీ, వాటర్ ప్రూఫ్ బ్యాటరీ దీని ప్రత్యేకత. అలాగే ఈ వెహికల్లో డిస్క్ బ్రేక్స్ కూడా ఉంటాయి.