EPFO News | కేంద్ర ప్రభుత్వం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బడ్జెట్ 2023ని ఆవిష్కరించింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త స్కీమ్స్ దగ్గరి నుంచి పోస్టాఫీస్ స్కీమ్స్ లిమిట్ పెంపు వరకు, ట్యాక్స్ స్లాబు మార్పులు, పన్ను మినహాయింపు పరిమితి పెంపు ఇలా చాలా అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కాగా కేంద్రం తాజా నిర్ణయంతో పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. టీడీఎస్ భారం కొంత దిగి వస్తుందని చెప్పుకోవచ్చు. అందువల్ల పీఎఫ్ ఖాతాకు పాన్ కార్డు లింక్ చేసుకోండి. అలాగే ఐదేళ్ల తర్వాత ట్యాక్స్ లేకుండా పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవడం ఉత్తమం.