దీంతో ఈ సంవత్సరం కూడా తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే (Work from home) అవకాశాన్ని కల్పించాయి పలు దిగ్గజ సంస్థలు. ముఖ్యంగా ఐటీ కంపెనీలైన కాగ్నిజంట్, టీసీఎస్, హెచ్సీఎల్ సహా ఈ-కామర్స్(E-commerce) కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని ఇచ్చాయి.(ప్రతీకాత్మక చిత్రం)
ఇంతకుముందు టీసీఎస్ తన ఉద్యోగుల్లో 50 నుంచి 70 శాతం మందిని జనవరి నుంచి కార్యాలయాలకు రావాలని ఆదేశించింది. కోవిడ్-19తో పాటు ఒమిక్రాన్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుండటంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఇప్పటికే దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో అధికారులు ఆంక్షలు విధిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ ఇదే బాటలో..
దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టీసీఎస్ తన ఉద్యోగుల్లో 90 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోం సౌలభ్యాన్నిచ్చింది. ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని కాగ్నిజంట్ సైతం ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు సూచించింది. కరోనా సోకకుండా కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలని, అన్నీ కుదిరితే ఏప్రిల్ నాటికి కార్యాలయాలు తిరిగి ఓపెన్ చేసే అవకాశాన్ని ఆలోచిస్తామని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
కోవిడ్-19 పరిస్థితులను మనస్సులో పెట్టుకుని జాగ్రత్తగా మసులుకోవాలని ఇన్ఫోసిస్ తన ఉద్యోగులను హెచ్చరించింది. ఈ ఏడాది కూడా దాదాపు వర్క్ ఫ్రమ్ హోం చేయాల్సి ఉంటుందని తెలిపింది. పరిస్థితులు సద్దుమణిగి, ఇన్ఫెక్షన్ రేట్లు తగ్గి, వ్యాక్సినేషన్ పుంజుకున్న తర్వాత బహుశా అప్పుడు కార్యాలయాలకు రావాల్సి ఉంటుందని ఈ సంస్థ ప్రతినిధి రిచర్డ్ లోబో స్పష్టం చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)