1. గత రెండేళ్లు కరోనా వైరస్ మహమ్మారి అనేక గుణపాఠాలను నేర్పింది. అందులో ఆర్థిక క్రమశిక్షణ కూడా ఒకటి. కరోనా మహమ్మారి తర్వాత డబ్బు పొదుపు చేయడం (Money Saving) దగ్గర్నుంచి ఇన్స్యూరెన్స్ తీసుకొని జీవితానికి బీమా ధీమా అందించడం వరకు అనేక కొత్త విషయాలు నేర్చుకున్నారు ప్రతీ ఒక్కరు. (ప్రతీకాత్మక చిత్రం)
2. మరి మీరు ఈ ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ ప్లానింగ్ (Tax Planning), ఖర్చుల లెక్కలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇప్పటి నుంచే మీ ప్లానింగ్ ప్రారంభం కావాలి. మరి ఈ ఆర్థిక సంవత్సరంలో ముఖ్యమైన తేదీలు ఏవీ? మీ ఇన్వెస్ట్మెంట్స్, ట్యాక్స్ సేవింగ్ లాంటివాటికి ఏఏ తేదీలను గుర్తుంచుకోవాలి? తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. April: మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏప్రిల్ నుంచే ప్రారంభించండి. ఈఎల్ఎస్ఎస్ సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చివరి నిమిషంలో కాకుండా ఇప్పట్నుంచే చేయండి. మీకు ఈ నెలలో బోనస్ వస్తే అప్పులు ఏమైనా ఉంటే వెంటనే తీర్చేయండి. టీడీఎస్ డిడక్షన్ తప్పించుకోవడానికి 15జీ, 15హెచ్ ఫామ్ సబ్మిట్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. May: మేలో ట్యాక్స్ ఫైలింగ్ సీజన్ ప్రారంభం అవుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్కమ్ స్టేట్మెంట్ సిద్ధం చేసుకోండి. అన్ని బ్యాంక్ అకౌంట్లు, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్స్యూరెన్స్ పాలసీల నామినీ వివరాలు అప్డేట్ చేయండి. ఇక మే 3న అక్షయ తృతీయ ఉంది. గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ రోజు కొనొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. July: జూలై 1న మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుల్ని టోకెనైజ్ చేసి ఆన్లైన్ లావాదేవీలను సురక్షితంగా మార్చుకోండి. ఇక డిసెంబర్ 31 లోగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి. అంతకన్నా ముందే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఓసారి చెక్ చేసి వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూడండి. (ప్రతీకాత్మక చిత్రం)
8. September: సెప్టెంబర్ 15 లోగా రెండో అడ్వాన్స్ ట్యాక్స్ ఇన్స్టాల్మెంట్ చెల్లించాలి. సెప్టెంబర్ 30న ఆరు నెలలు ముగుస్తుంది కాబట్టి మీ పోర్ట్‌ఫోలియోను ఓసారి సమీక్షించండి. మీ పెట్టుబడుల్ని ప్లాన్ చేయండి. సెప్టెంబర్ తర్వాత పండుగ సీజన్ వస్తుంది. కాబట్టి మీ ఖర్చులను ప్లాన్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
10. November: నవంబర్ 14న బాలల దినోత్సవం. ఆ రోజున మీ పిల్లలకు డబ్బు గురించి కొన్ని పాఠాలు చెప్పండి. బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటీ? క్రెడిట్ కార్డ్ అంటే ఏంటీ? డబ్బులు ఎలా పొదుపు చేయాలా? ఎలా ఖర్చు చేయాలి? అన్న విషయాలు నేర్పించండి. వింటర్లో టూర్లకు వెళ్లాలనుకుంటే ప్లాన్ చేసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
11. December: డిసెంబర్ 15 లోగా మూడో అడ్వాన్స్ ట్యాక్స్ ఇన్స్టాల్మెంట్ చెల్లించాలి. డిసెంబర్‌తో క్యాలెండర్ ఇయర్ ముగుస్తుంది కాబట్టి ఏడాదిలో మీరు చేసిన ఖర్చుల వివరాలు ఓసారి చెక్ చేయండి. అనవసరమైన ఖర్చులు ఏవైనా ఉంటే ఓ డైరీలో నోట్ చేసుకోండి. ఇకపై అలాంటి ఖర్చులు చేయకూడదని తీర్మానించుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
14. March: మార్చి 15 లోగా మూడో అడ్వాన్స్ ట్యాక్స్ ఇన్స్టాల్మెంట్ చెల్లించాలి. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ ట్యాక్స్ ప్లానింగ్ చేయడానికి మార్చి 31 చివరి తేదీ. అంతేకాదు... ఇప్పటివరకు పాన్, ఆధార్ లింక్ చేయనివారు 2023 మార్చి 31 లోగా ఆ పనిపూర్తి చేయాలి. జరిమానా చెల్లించక తప్పదు. (ప్రతీకాత్మక చిత్రం)