2. కానీ పన్ను చెల్లింపుదారులకు వీటి గురించి తెలిసింది తక్కువే. ఎక్కువగా 80సీ, 80డీ మినహాయింపుల గురించే చర్చిస్తుంటారు. కానీ ఇంకా చాలా మినహాయింపులు, తగ్గింపులతో పన్ను భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. మరి ఏ సెక్షన్ ప్రకారం మీరు ఎంత పన్ను ఆదా చేయొచ్చో, ఎంత లిమిట్ ఉంటుందో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. Section 80C: ఇది పాపులర్ ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్. సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకు లిమిట్ ఉంటుంది. ఈ సెక్షన్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం, బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీసుల్లో ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్స్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్, ఈక్విటీ లింక్డ్ మ్యూచువల్ ఫండ్స్, పిల్లల ట్యూషన్ ఫీజ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, హోమ్ లోన్ ప్రిన్సిపల్ పేమెంట్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ లాంటివి ఈ సెక్షన్లోకి వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. Section 80CCC: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన యాన్యుటీ ప్లాన్ లేదా ఫండ్ నుంచి పెన్షన్ పొందడం కోసం ఏదైనా ఇతర జీవిత బీమా కంపెనీలో దాచుకునే డబ్బులకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ సెక్షన్ కింద రూ.1,50,000 వరకు తగ్గింపు పొందొచ్చు. ప్రభుత్వం నోటిఫై చేసిన నేషనల్ పెన్షన్ స్కీమ్స్ లాంటి పెన్షన్ పథకాల్లో దాచుకునే మొత్తానికి సెక్షన్ 80సీసీడీ కింద మినహాయింపు లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. Section 80DDB: సెక్షన్ 80డీడీబీ కింద 60 ఏళ్ల లోపు వ్యక్తులు తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స తీసుకుంటే రూ.40,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. తమపై ఆధారపడ్డవారికి చికిత్స చేయించినా క్లెయిమ్ వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లకు రూ.60,000 వరకు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు రూ.80,000 వరకు లిమిట్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. Section 80E: ఉన్నత విద్య కోసం లోన్ తీసుకుంటే చెల్లించిన వడ్డీపై సెక్షన్ 80ఈ కింద తగ్గింపు పొందొచ్చు. అయితే ఎడ్యుకేషన్ లోన్లో అసలు చెల్లిస్తే ట్యాక్స్ డిడక్షన్స్ పొందలేరు. తొలిసారి ఇల్లు కొన్నవారు రూ.50,000 వరకు హోమ్ లోన్ వడ్డీపై సెక్షన్ 80ఈఈ కింద అదనంగా ట్యాక్స్ డిడక్షన్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)