1. దూర ప్రయాణాలు చేయాలంటే మనందరం రైల్వేల వైపే మొగ్గు చూపుతుంటాం. అలా భారతీయ రైల్వేలు (Indian Railways) మన జీవితాల్లో అంతర్భాగాలు అయిపోయాయి. ఇవి రోజూ కోట్లాది మంది ప్రజలను గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావడంతో ఇప్పుడు టికెట్ రిజర్వేషన్లు కూడా ఇంట్లో నుంచే చేసుకోవడానికి వీలవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. అయితే చాలా సార్లు కన్ఫర్మేషన్ టికెట్ కాకుండా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు (Waiting List Tickets) కూడా మనకు వస్తుంటాయి. మనకంటే ముందు టికెట్ బుక్ చేసుకున్న వారు, ఆ టికెట్‌ను క్యాన్సిల్ చేసుకున్న సందర్భంలో.. మనకు వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. అయితే దీనిలో ఒకటే రకం వెయిటింగ్ లిస్ట్ ఉంటుందనుకుంటే పొరపాటే. వీటిలో చాలా రకాల తేడాలున్నాయి. అవేంటో తెలుసుకుంటేనే మన టికెట్ కన్ఫర్మేషన్ ఎలా అవుతుందనే విషయంలో క్లారిటీ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్ (RLWL): రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్ కింద సాధారణంగా ఇంటర్మీడియట్ స్టేషన్లలో బెర్తులు ఖాళీ అయ్యే అవకాశాలు ఉంటే.. మనకు ఈ వెయిటింగ్ లిస్ట్ అలాట్ చేస్తారు. దీనిలో టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే మనం రైలు ఎక్కిన తర్వాత ముందు స్టేషన్లలో ఎక్కడైనా బెర్తు ఖాళీ అయితే దాన్ని మనకు కన్ఫర్మ్ చేస్తారు. రైలు షెడ్యూల్ టైంకి రెండు, మూడు గంటల ముందు రిమోట్ లొకేషన్లలో ఈ ఛార్ట్స్ ప్రిపేర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్ (PQWL): అనేక చిన్న స్టేషన్లు పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్ (PQWL)ని పంచుకుంటాయి. ఇవి సాధారణంగా ఇంటర్మీడియట్ స్టేషన్ల మధ్య ప్రయాణాలు చేసేవారికి కేటాయిస్తారు. అంటే రైలు స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ కాకుండా మధ్యలో ఎక్కి, మధ్యలో దిగిపోయేవారికి సాధారణంగా ఈ వెయిటింగ్ లిస్ట్ లో టికెట్లను ఇస్తారు. ఇవి కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8. అభ్యర్థన నిరీక్షణ జాబితా (RQWL): ఒక ఇంటర్మీడియట్ స్టేషన్ నుండి మరొక ఇంటర్మీడియట్ స్టేషన్‌కు బుక్ చేయాలంటే మనం ఈ కోటా కింద రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఒక పరిమితి తర్వాత వెయిటింగ్ లిస్ట్‌ను జనరల్ కోటా, రిమోట్ లొకేషన్ కోటా, పూల్డ్ కోటాల్లో ఆపేస్తారు. తర్వాత వాటిని ఇక జారీ చేయరు. అలాంటప్పుడు ఇక వాటిలో మన టికెట్ కవర్ అయ్యే అవకాశం ఉండదు. అప్పుడు మన టికెట్ ని RQWL పరిధిలో ఉంచమని రిక్వెస్ట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
9. తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ (CKWL): తత్కాల్ టిక్కెట్ల కోసం రూపొందించిన వెయిటింగ్ లిస్ట్‌ను CKWL అంటారు. GNWLలో కొన్నింటిని RAC కింద ఇచ్చి ఒక సీటును ఇద్దరు పంచుకునేలా చేస్తారు. అయితే తత్కాల్ టికెట్లు అలా కాదు. వీలున్నంత వరకు పూర్తిగా కన్ఫర్మేషన్ వస్తాయి. తర్వాత వెయిటింగ్ లిస్ట్ లోకి వస్తాయి. అయితే చార్ట్ ప్రిపేర్ చేసే సమయంలో ముందుగా జనరల్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్లను కన్ఫర్మ్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందువల్ల ఈ వెయిటింగ్ లిస్ట్ లో టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)