1. ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. ఈ సెగ్మెంట్లోకి చాలా ఆటో మొబైల్ కంపెనీలు ప్రవేశించాయి. అయితే టాటామోటార్స్ అత్యధిక ఈవీలను విక్రయిస్తోన్న కంపెనీగా రికార్డు సృష్టించింది. ఈ రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నట్లు కూడా టాటా గ్రూప్ ప్రకటించింది. ఇటీవలే కంపెనీ టియాగో ఈవీ (Tiago EV)ని లాంచ్ చేసింది. (Photo: Paras Yadav/News18.com)
3. టాటా టియాగో EVని కంపెనీ డీలర్‌షిప్‌లో లేదా బ్రాండ్ వెబ్సైట్లో రూ.21,000 టోకెన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. టియాగో EVని ఈ నెలలో ప్రధాన నగరాల్లోని ప్రముఖ మాల్స్‌లో ప్రదర్శనకు ఉంచనున్నారు. టెస్ట్ డ్రైవ్‌లు డిసెంబర్ చివరి నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు 2023 జనవరి నుంచి మొదలవుతాయి. టియాగో EV డెలివరీ తేదీ కస్టమర్ ఎంచుకున్న వేరియంట్, కలర్, సమయంపై ఆధారపడి ఉంటుంది. (Photo: Paras Yadav/News18.com)
4. కస్టమర్ ఇన్పుట్ల ఆధారంగా 24kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ల ఉత్పత్తికి కంపెనీ ప్రాధాన్యం ఇచ్చింది. టాటా టియాగో EV 19.2kWh, 24kWh వంటి రెండు IP67 రేటెడ్ బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఒక్క ఛార్జ్‌తో 19.2kWh బ్యాటరీప్యాక్ 250 కి.మీల డ్రైవింగ్ రేంజ్‌ను, 24kWh బ్యాటరీప్యాక్ 315 కి.మీ. డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తాయి. (Photo: Paras Yadav/News18.com)
5. జిప్ట్రాన్ (Ziptron) టెక్నాలజీ ఆధారంగా రూపొందిన టాటా టియాగో EV.. సిటీ, స్పోర్ట్ అనే రెండు డ్రైవ్ మోడ్లతో వస్తుంది. ఈ కార్ణు 15A ప్లగ్ పాయింట్, స్టాండర్డ్ 3.3kW AC ఛార్జర్, 7.2kW AC హోమ్ ఫాస్ట్ ఛార్జర్, DC ఫాస్ట్ ఛార్జింగ్ వంటి నాలుగు వేర్వేరు సోర్సెస్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. 7.2kW AC ఫాస్ట్ ఛార్జర్ కేవలం 30 నిమిషాల ఛార్జింగ్‌లో 35 కిమీ డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. ఇది కార్‌ను కేవలం 3 గం 36 నిమిషాలలో పూర్తిగా ఛార్జ్ చేయగలదు. DC ఫాస్ట్ ఛార్జింగ్ కేవలం 30 నిమిషాల్లో 110 కిమీ రేంజ్‌ను అందిస్తుంది. దీని 10-80 శాతం ఛార్జింగ్ సమయం 57 నిమిషాలుగా ఉంది. (Photo: Paras Yadav/News18.com)
6. టాటా టియాగో ఎలక్ట్రిక్‌లో లెథరెట్ సీట్లు, కాంట్రాస్ట్ రూఫ్, ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్రొజెక్టర్ ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, 45 కనెక్ట్ కార్ ఫీచర్లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇది సెగ్మెంట్ ఫస్ట్ టెలిమాటిక్స్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. గ్లోబల్ NCAP నుంచి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. EV టీల్ బ్లూ, డేటోనా గ్రే, ప్రిస్టైన్ వైట్, మిడ్నైట్ ప్లమ్, ట్రాపికల్ మిస్ట్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. (Photo: Paras Yadav/News18.com)
7. బుకింగ్స్‌పై టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మార్కెటింగ్, సేల్స్, సర్వీస్ స్ట్రాటజీ హెడ్, శ్రీ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ..‘Tiago.ev అనేది ఎలక్ట్రిక్ ట్రెండ్‌సెట్టర్. ఇది ప్రీమియం సెక్యూరిటీ, టెక్నాలజీ ఫీచర్లను అందిస్తుంది. కస్టమర్ల అవసరాల ఆధారంగా 24kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌పై ఎక్కువ దృష్టి పెట్టాం. మా EVలను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నాం. ఈ లాంచ్‌తో 80 కొత్త నగరాల్లోకి ప్రవేశిస్తున్నాం. మా నెట్‌వర్క్‌ను 165 కంటే ఎక్కువ నగరాలకు విస్తరింపజేస్తున్నాం.’ అని చెప్పారు. (Photo: Paras Yadav/News18.com)