1. టాటా మోటార్స్ నుంచి మరో రెండు సీఎన్జీ కార్లు (CNG Cars) రాబోతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్థ భాగంలోనే టాటా ఆల్ట్రోజ్, టాటా పంచ్ కార్లను సీఎన్జీ వర్షన్లో తీసుకురాబోతున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. 2023 జూన్‌లోనే టాటా నుంచి కొత్త సీఎన్జీ కార్లు రావచ్చని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)
2. టాటా పంచ్ సీఎన్జీ కారు ధర రూ.5.49 ఉంటుందని అంచనా. ఇక టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కార్ ధర రూ.6.45 లక్షల నుంచి రూ.10.40 లక్షల మధ్య ఉంటుంది. ఆటో ఎక్స్పో 2023 ఈవెంట్లో ఈ రెండు సీఎన్జీ కార్లను ప్రదర్శించింది టాటా మోటార్స్. వాటిని వీలైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ, టాటా పంచ్ ఐసీఎన్జీ కార్లలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. టాటా టియాగో సీఎన్జీ కార్లో ఉన్నట్టుగానే పవర్‌ట్రెయిన్ ఉంటుంది. కొత్త మోడళ్లలో ట్విన్-సిలిండర్ టెక్నాలజీ ఉంటుంది. 60-లీటర్ ట్యాంక్‌ను రెండు చిన్న 30-లీటర్లుగా విభజించడం ద్వారా బూట్ స్పేస్ ఆదా అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక టాటా పంచ్ ఐసీఎన్జీ కారుకు ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. ఈ సెగ్మెంట్లో నేరుగా పోటీపడే ఇతర కంపెనీల సీఎన్జీ కార్లు లేవు. 2045 నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారాల కోసం కంపెనీ తన లక్ష్యాన్ని ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఆటో ఎక్స్‌పోలో పెట్రోల్, డీజిల్ కాకుండా ఇతర ఇంధనంతో నడిచే మోడల్స్, కాన్సెప్ట్స్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఎవిన్యా ఈవీ, హారియర్ ఈవీ, సియెర్రా ఈవీ, మ్యాజిక్ ఈవీ, అలాగే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ట్రక్లు ఆటో ఎక్స్‌పోలో కనిపించాయి. మరోవైపు ఇప్పటికే టాటా టియాగో ఈవీ, టాటా టిగోర్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఉన్నాయి. టాటా పంచ్ ఈవీ కూడా మార్కెట్లోకి రానుందని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)