1. టాటా మోటార్స్ నుంచి నెక్సాన్ ఈవీ మరో వేరియంట్ వచ్చేసింది. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్‌ఎం (Tata Nexon EV MAX XM) పేరుతో కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్‌ను లాంఛ్ చేసింది కంపెనీ. ఈ కార్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తే 453 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ కార్ ఎక్స్-షోరూమ్ ధర రూ.16.49 లక్షలు. బుక్ చేసినవారికి 2023 ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. (image: Tata Motors)
2. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్‌ఎం మోడల్లో ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, i-VBACతో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్లతో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, పుష్ బటన్ స్టార్ట్, డిజిటల్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ZConnect కనెక్ట్ చేయబడిన కార్ టెక్ స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ రియర్ డిస్క్ బ్రేక్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Tata Motors)
4. భారతదేశంలో నెంబర్ 1 ఈవీ అయిన నెక్సాన్ ఈవీ మూడేళ్లు పూర్తి చేసుకుందని, 40,000 కస్టమర్లు ఉన్నారని, 600 మిలియన్ కిలోమీటర్లు తిరిగిందని, స్థిరమైన రవాణాను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మేము కట్టుబడి ఉన్నామని, ఈ సందర్భంగా మరో ముందడుగు వేశామని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మార్కెటింగ్, సేల్స్, సర్వీస్ స్ట్రాటజీ హెడ్ వివేక్ శ్రీవాత్సవ అన్నారు. (image: Tata Motors)
5. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్జెడ్+ ధర రూ.18.49 లక్షలు. ఇందులో అనేక అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. వెంటిలేషన్‌తో లెథెరెట్ సీట్లు, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎమ్, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫైయర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హర్మాన్ సపోర్ట్‌తో 8 స్పీకర్లు, 8-అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, హిల్ డిసెంట్ కంట్రోల్, షార్క్‌ఫిన్ యాంటెన్నా ఉన్నాయి. (image: Tata Motors)
6. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఇతర ఫీచర్స్ చూస్తే ఈ ఎలక్ట్రిక్ కార్ వేర్వేరు ఛార్జింగ్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. 3.3 కిలోవాట్ లేదా 7.2 కిలోవాట్ ఛార్జర్లు అందుబాటులో ఉంటాయి. 7.2 కిలోవాట్ ఏసీ ఫాస్ట్ ఛార్జర్‌ను ఇంట్లో లేదా ఆఫీసులో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఛార్జర్‌తో ఛార్జింగ్ సమయం 6.5 గంటలకు తగ్గుతుంది. ఇక 50 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 56 నిమిషాల్లో సున్నా నుంచి 80 శాతం ఛార్జింగ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. (image: Tata Motors)