1. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో సత్తా చాటుతున్న టాటా మోటార్స్ ఇటీవల మరో కొత్త మోడల్‌ను రిలీజ్ చేసింది. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ (Tata Nexon EV Max) మోడల్‌ను పరిచయం చేసింది. గతంలోనే టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) మార్కెట్లో ఉన్న సంగతి తెలిసిందే. లేటెస్ట్గా టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మోడల్‌ను తీసుకొచ్చింది. హైవోల్టేజ్ జిప్ట్రాన్ టెక్నాలజీతో ఈ కొత్త కార్ వచ్చింది. (image: Tata Motors)
2. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కార్ బుక్ చేసిన తర్వాత డెలివరీ కోసం నాలుగు నెలల వరకు ఆగాల్సిన పరిస్థితి ఉంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.17.74 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ XZ+, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ XZ+ లక్స్ ట్రిమ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. మూడు కలర్స్‌లో కొనొచ్చు. డేటోనా గ్రే, ప్రిస్టైన్ వైట్, ఇంటెన్సీ టీల్ రంగుల్లో లభిస్తుంది. (image: Tata Motors)
3. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ కార్ ప్రత్యేకతలు చూస్తే ఇందులో 40.5 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 437 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. లాంగ్ జర్నీ ప్లాన్ చేసుకున్నా ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ 250 Nm టార్క్‌తో 105 kW పవర్ డెలివరీ చేస్తుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 9 సెకండ్లలో అందుకుంటుంది. (image: Tata Motors)
4. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ కార్ వేర్వేరు ఛార్జింగ్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. 3.3 కిలోవాట్ లేదా 7.2 కిలోవాట్ ఛార్జర్లు అందుబాటులో ఉంటాయి. 7.2 కిలోవాట్ ఏసీ ఫాస్ట్ ఛార్జర్‌ను ఇంట్లో లేదా ఆఫీసులో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఛార్జర్‌తో ఛార్జింగ్ సమయం 6.5 గంటలకు తగ్గుతుంది. ఇక 50 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 56 నిమిషాల్లో సున్నా నుంచి 80 శాతం ఛార్జింగ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. (image: Tata Motors)
5. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ కారులో ఇకో, సిటీ, స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఎనిమిది కొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి. ZConnect 2.0 కార్ టెక్నాలజీ కూడా ఉంది. ZConnect యాప్ ద్వారా 48 కార్ ఫీచర్స్ ఆపరేట్ చేయొచ్చు. స్మార్ట్‌వాచ్ ఇంటిగ్రేషన్, ఆటో, మ్యాన్యువల్ డీటీసీ చెక్, ఛార్జింగ్ లిమిట్, మంత్లీ వెహికిల్ రిపోర్ట్స్, డ్రైవ్ అనలిటిక్స్ లాంటివన్నీ తెలుసుకోవచ్చు. (image: Tata Motors)
6. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ కారులో సేఫ్టీ ఫీచర్స్ చూస్తే ఇందులో ఇంటెలిజెంట్ వ్యాక్యూమ్ లెస్ బూస్ట అండ్ యాక్టీవ్ కంట్రోల్ (i-VBAC), హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ , 4 డిస్క్ బ్రేక్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. బ్యాటరీ, మోటార్ వారెంటీ విషయానికి వస్తే 8 ఏళ్లు లేదా 1,60,000 కిలోమీటర్ల వారెంటీ ఇస్తోంది కంపెనీ. (image: Tata Motors)