1. టాటా మోటార్స్ రెండు ఎలక్ట్రిక్ వాహనాల ధరల్ని రూ.25,000 చొప్పున పెంచింది. టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV), టాటా టిగార్ ఈవీ (Tata Tigor EV) అన్ని వేరియంట్లపై ధర రూ.25,000 పెరిగింది. టాటా నెక్సాన్‌లో XM, XM Plus, XZ Plus, XZ Plus Dark Edition మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు టాటా నెక్సాన్ ఈవీ ప్రారంభ ధర రూ.14.79 లక్షలు. (Image courtesy: Manav Sinha/News18.com)
2. ఇక టాటా టిగార్ ఈవీలో XE, XM, XZ PLus, XZ Plus DT మోడల్స్ ఉన్నాయి. ప్రారంభ ధర రూ.12.49 లక్షలు. ఇటీవల టాటా మోటార్స్ పెట్రోల్, డీజిల్ కార్లపై రూ.22,500 పెంచిన సంగతి తెలిసిందే. టాటా సఫారీ కారుపై రూ.22,500, టాటా ఆల్ట్రోజ్ కారుపై రూ.20,000, టాటా హారియర్ కారుపై రూ.18,400, టాటా నెక్సాన్ స్టాండర్డ్ మోడల్‌పై రూ.17,000, టాటా టియాగో, టిగార్ మోడల్‌పై రూ.15,000 చొప్పున ధర పెరిగింది. (Image: Arjit Garg/News18.com)
3. పెట్రోల్, డీజిల్ కార్ల ధరల్ని పెంచిన తర్వాత ఎలక్ట్రిక్ కార్ల ధరల్ని కూడా పెంచింది టాటా మోటార్స్. టాటా నెక్సాన్ ఈవీ ధరను టాటా మోటార్స్ పెంచడం ఇదే మొదటిసారి కాదు. రెండు నెలల క్రితం కూడా రూ.25,000 ధర పెరిగింది. ఇప్పుడు మరో రూ.25,000 పెరిగింది. మొత్తం కలిపి టాటా నెక్సాన్ ఈవీ కారుపై ఏకంగా రూ.50,000 ధర పెరిగింది. (Image courtesy: Manav Sinha/News18.com)
4. టాటా నెక్సాన్ ఈవీ అన్ని మోడల్స్‌పై మూడు నెలల్లో రూ.50,000 పెరిగింది. ప్రస్తుతం టాటా నెక్సాన్ ఈవీ ధరలు చూస్తే XM మోడల్ ధర రూ.14.79 లక్షలు, XZ Plus మోడల్ ధర రూ.16.20 లక్షలు, XZ Plus LUX మోడల్ ధర రూ.17.20 లక్షలు, Dark XZ Plus మోడల్ ధర రూ.16.49 లక్షలు, Dark XZ Plus LUX మోడల్ ధర రూ.17.40 లక్షలు. (Image courtesy: Manav Sinha/News18.com)
5. ఇక టాటా టిగార్ ఈవీ ధరలు చూస్తే XE మోడల్ ధర రూ.12.49 లక్షలు, XM మోడల్ ధర రూ.12.99 లక్షలు, XZ Plus మోడల్ ధర రూ.13.49 లక్షలు, XZ Plus DT మోడల్ ధర రూ.13.64 లక్షలు. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలే. ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తాయి. ఈ సబ్సిడీని బట్టి ఆన్ రోడ్ ధర మారుతూ ఉంటుంది. (Image: Arjit Garg/News18.com)
6. టాటా నెక్సాన్ ఈవీ విశేషాలు చూస్తే ఇందులో 30.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో ఒక గంటలో 80 శాతం ఛార్జ్ చేయొచ్చు. రెగ్యులర్ హోమ్ ఛార్జర్‌తో 10 శాతం నుంచి 90 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 8.30 గంటలు పడుతుంది. కస్టమర్లకు ఉచితంగా హోమ్ ఛార్జర్ ఇన్స్టాలేషన్ లభిస్తుంది. 24×7 ఎమర్జెన్సీ సపోర్ట్ కూడా లభిస్తుంది. (Image courtesy: Manav Sinha/News18.com)
8. ఇక టాటా టిగార్ ఈవీ విశేషాలు చూస్తే జిప్ట్రాన్ టెక్నాలజీతో ఈ కారు తయారైంది. ఇందులో 30.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. సింగిల్ ఛార్జ్‌తో 312 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని 5.7 సెకండ్లలో అందుకోవచ్చు. 8 ఏళ్లు లేదా 160,000 కిలోమీటర్ల బ్యాటరీ, మోటార్ వారెంటీ లభిస్తుంది. (Image: Arjit Garg/News18.com)
10. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ కారులో 40.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 437 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 9 సెకండ్లలో అందుకుంటుంది. 3.3 కిలోవాట్ లేదా 7.2 కిలోవాట్ ఛార్జర్లు అందుబాటులో ఉంటాయి. 7.2 కిలోవాట్ ఏసీ ఫాస్ట్ ఛార్జర్‌తో ఛార్జింగ్ సమయం 6.5 గంటలకు తగ్గుతుంది. (image: Tata Motors)