ముడి పదార్థాల ధరలు పెరిగాయని, దీని వల్ల ఉత్పత్తి వ్యయాలు పైకి చేరాయని టాటా మోటార్స్ పేర్కొంది. అందుకే ఇప్పుడు ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపింది. కాగా టాటా మోటార్స్ టియాగో, పంచ్, నెక్సన్, హరియర్, సఫారీ వంటి పలు మోడళ్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది.