Tata Motors Car Sales in October: కరోనాతో డీలా పడిన ఆటోమొబైల్ ఇండస్ట్రీకి దసరా, దీపావళి పండుగ సీజన్ బాగా కలిసి వచ్చింది. నిజానికి కరోనా వ్యాప్తికి ముందు నుంచే ఈ రంగం తిరోగమనంలో ఉంది. దీనికి లాక్డౌన్ కూడా తోడవ్వడంతో కార్ల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. ప్రభుత్వాలు ఆంక్షలు ఎత్తివేయడంతో అమ్మకాలపై కార్ల తయారీ కంపెనీలు దృష్టి పెట్టాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించాయి.