Tata Safari 2021: కొత్త టాటా సఫారీ వచ్చేసింది... ఎలా ఉందంటే (Photos)
Tata Safari 2021: కొత్త టాటా సఫారీ వచ్చేసింది... ఎలా ఉందంటే (Photos)
Tata Safari 2021 | టాటా మోటార్స్ సరికొత్త టాటా సఫారీని ఆవిష్కరించింది. పూణెలోని ప్లాంట్ నుంచి తొలి టాటా సఫారీని ప్రపంచానికి పరిచయం చేసింది. అసలు కొత్త టాటా సఫారీ ప్రత్యేకతలు ఏంటీ? ఆకట్టుకునే ఫీచర్స్ ఏంటీ? తెలుసుకోండి.
1. ఇదే సరికొత్త టాటా సఫారీ. సరికొత్త అవతారంతో ప్రపంచానికి పరిచయమైంది. త్వరలో షోరూమ్స్‌లో కొత్త టాటా సఫారీ ప్రత్యక్షం కానుంది. ఇందులో అనేక అత్యాధునిక ఫీచర్స్ ఉండటం విశేషం. (image: Tata Motors)
2/ 12
2. టాటా సఫారీ ఇమాజినేటర్ సూట్‌ను కూడా ఆవిష్కరించింది టాటా మోటార్స్. ఆగ్యుమెంటెడ్ రియాల్టీ ద్వారా ఇంటరాక్టీవ్ ఫీచర్స్‌ని వివరించనుంది. అంటే మీరు ఉన్న చోటి నుంచి టాటా సఫారీ విశేషాలను తెలుసుకోవచ్చు. (image: Tata Motors)
3/ 12
3. టాటా సఫారీని పూణెలోని యూనిట్లో తయారు చేస్తోంది టాటా మోటార్స్. బుకింగ్స్ ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. త్వరలోనే షోరూమ్స్లోకి టాటా సఫారీ రానుంది. (image: Tata Motors)
4/ 12
4. 'రీక్లెయిమ్ యువర్ లైఫ్' పేరుతో టాటా సఫారీని ప్రచారం చేస్తోంది టాటా మోటార్స్. పవర్, పర్ఫామెన్స్, ప్రజెన్స్, ప్రెస్టీజ్ లాంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చినట్టు చెబుతోంది. (image: Tata Motors)
5/ 12
5. టాటా సఫారీ విశేషాలు చూస్తే 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది. పెట్రోల్ మోటార్‌ను తర్వాత అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రొజెక్టర్ లెన్స్‌తో స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డ్యూయెల్ టోన్ మెషీన్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్ లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Tata Motors)
6/ 12
6. టాటా సఫారీ లోపల ఓయ్స్టర్ వైట్ ఇంటీరియర్ థీమ్, వుడ్ ఫినిష్ డ్యాష్‌బోర్డ్ ఉంటాయి. ఇది సెవెన్ సీటర్ వెహికిల్. సాఫ్ట్ టచ్ మెటీరియల్స్‌తో లగ్జరీగా ఉంటుంది. ఇక ఇన్ఫోటైమ్మెంట్ కోసం యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో లాంటివి ఉంటాయి. (image: Tata Motors)
7/ 12
7. టాటా సఫారీలో లెదర్ సీట్లు, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎక్స్‌ప్రెస్ కూల్, వాయిస్ కమాండ్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. (image: Tata Motors)