ఈ ఆఫర్లలో భాగంగా క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, కార్పొరేట్ ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, టాటా పంచ్ మోడల్‌పై మాత్రం ఎటువంటి ఆఫర్ ప్రకటించలేదు. దీనితో పాటు టాటా నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీలపై కూడా ఆఫర్ ప్రకటించలేదు. కాగా, ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ పొందవచ్చో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
టాటా ఆల్ట్రోజ్
టాటా ఆల్ట్రోజ్‌కు చెందిన టర్బో-పెట్రోల్ వేరియంట్‌పై రూ. 10,000 కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, అల్ట్రోజ్పై ఎటువంటి క్యాష్ డిస్కౌంట్ లేదా ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ లభించవు. కాగా, టాటా ఆల్ట్రోజ్ డీజిల్ యూనిట్‌తో సహా మూడు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఆల్ట్రోజ్1.2 -లీటర్ పెట్రోల్ వేరియంట్ 6,000 rpm వద్ద 86PS శక్తిని, 3,300 rpm వద్ద 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇక, 1.5 -లీటర్ డీజిల్ వేరియంట్ 4,000 rpm వద్ద 90PS శక్తిని, 3,000 rpm వద్ద 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. భద్రత పరంగా, ఆల్ట్రోజ్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లలో 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఇది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. (ప్రతీకాత్మక చిత్రం)
టాటా నెక్సాన్ .. టాటా నెక్సాన్‌పై రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్‌ను అందిస్తోంది. అదనంగా, నెక్సాన్ డీజిల్ వేరియంట్‌పై రూ. 10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే పెట్రోల్ వేరియంట్‌పై మాత్రం రూ. 5,000 మాత్రమే లభిస్తుంది. టాటా నెక్సాన్ గ్లోబల్ NCAP క్రాష్ సేఫ్టీ టెస్ట్‌లలో 5 స్టార్ రేటింగ్‌ను పొందింది.(ప్రతీకాత్మక చిత్రం)
టాటా టియాగో ... ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టియాగోపై రూ. 10,000 వరకు క్యాష్ డిస్కౌంట్లభిస్తుంది. అదనంగా, రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇవన్నీ కలుపుకుంటే మొత్తం రూ. 30,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, టియాగో పెట్రోల్ వేరియంట్‌పై మాత్రమే క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
టాటా టిగోర్ .. టాటా టిగోర్, టాటా టియాగో రెండు హ్యాచ్బ్యాక్లూ ఒకే ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తాయి. టాటా టిగోర్ పెట్రోల్ వేరియంట్‌పై రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. మరోవైపు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 వరకు కార్పొరేట్ బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే, సీఎన్జీ వేరియంట్లకు మాత్రం ఆఫర్ వర్తించదు.(ప్రతీకాత్మక చిత్రం)
టాటా సఫారి .. టాటా మోటార్ ఫ్లాగ్షిప్ ఎస్యూవీ సఫారిపై రూ. 20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, అదనంగా రూ. 40,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఇలా మొత్తం రూ. 60,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, క్యాష్ డిస్కౌంట్ కేవలం 2021 సఫారీకి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, సఫారీపై ఎటువంటి కార్పొరేట్ బెనిఫిట్స్ లభించవు. టాటా సఫారి సింగిల్ 2.0 -లీటర్ క్రియోటెక్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 3,750 rpm వద్ద 170PS గరిష్ట శక్తిని, 1,750 rpm, 2,500 rpm వద్ద 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
టాటా హారియర్.. టాటా హారియర్‌పై సఫారీకి సమానమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఈ వేరియంట్‌పై రూ. 20,000 నగదు తగ్గింపు, రూ. 40,000 వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు పొందవచ్చు. మరోవైపు, రూ. 5 వేల కార్పొరేట్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఇలా, మొత్తం రూ. 65,000 ఆదా చేసుకోవచ్చు. టాటా సఫారీ -3,750 rpm వద్ద 170PS శక్తిని, 1,750 rpm, 2,500 rpm వద్ద 350Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)