ఎంపిక చేసిన మోడళ్లపై ఏకంగా రూ. 85 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఆశ్చర్యపరిచే సేఫ్టీ రేటింగ్స్‌తో కార్లను విడుదల చేస్తున్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో తనదైన ముద్ర వేసుకుంది. అత్యుత్తమ -ఇన్-క్లాస్ ఫీచర్లతో కొత్త మోడళ్లను లాంచ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు అమ్మకాలను పెంచుకోవడంలో భాగంగా అన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
టాటా వాహన ప్రియులు ఎక్కువగా ఇష్టపడే టాటా సఫారీ ఎస్‌యూవీపై కూడా డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో భాగంగా ఏదైనా 2021 టాటా మోడల్‌ను ఎక్స్ఛేంజ్ చేసి టాటా సఫారీ కొనుగోలు చేస్తే అదనంగా రూ. 60 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇదే క్రమంలో ఏదైనా 2022 టాటా మోడల్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 40 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందజేస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ రెండు మోడళ్లపై అడిషనల్ డిస్కౌంట్, బోనస్‌లు, క్యాష్ డిస్కౌంట్లు పొందవచ్చు. 2021 నెక్సాన్ డీజిల్ వేరియంట్‌తో మీ కారును ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 15 వేల వరకు బోనస్ లభిస్తుంది. నెక్సాన్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై వరుసగా రూ. 5 వేలు, రూ. 10 వేలు విలువైన కార్పొరేట్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)