1. టాటా మోటార్స్ రిలీజ్ చేసిన ఎలక్ట్రిక్ కార్ టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ కారు కొనాలనుకుంటే కాస్త ఎక్కువ ధర చెల్లించక తప్పదు. ఈ కారు ధరను పెంచింది కంపెనీ. అన్ని వేరియంట్ల ధర రూ.25,000 పెరిగింది. కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. టాటా మోటార్స్ వెబ్సైట్లో కొత్త ధరలు కనిపిస్తున్నాయి. (Image courtesy: Manav Sinha/News18.com)
2. భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా నెక్సాన్ ఈవీకి పేరు లభించింది. గత నెలలో 2,250 పైగా యూనిట్లను అమ్మింది టాటా మోటార్స్. రెండేళ్లలో 13,500 యూనిట్స్ అమ్మినట్టు కంపెనీ ప్రకటించింది. టాటా నెక్సాన్ ఈవీ ఐదు వేరియంట్లలో లభిస్తోంది. XM, XZ Plus, XZ Plus Luxury, Dark XZ Plus, Dark XZ Plus Luxury వేరియంట్లలో ఈ కారును కొనొచ్చు. ఈ ఐదు వేరియంట్ల ధర పెరిగింది. (Image courtesy: Manav Sinha/News18.com)
3. XM మోడల్ పాత ధర రూ.14.29 లక్షలు కాగా లేటెస్ట్ ధర రూ.14.54 లక్షలు. XZ Plus మోడల్ పాత ధర రూ.15.70 లక్షలు కాగా లేటెస్ట్ ధర రూ.15.95 లక్షలు. XZ Plus LUX మోడల్ పాత ధర రూ.16.70 లక్షలు కాగా లేటెస్ట్ ధర రూ.16.95 లక్షలు. Dark XZ Plus మోడల్ పాత ధర రూ.16.04 లక్షలు కాగా లేటెస్ట్ ధర రూ.16.29 లక్షలు. (Image courtesy: Manav Sinha/News18.com)
4. ఇక Dark XZ Plus LUX మోడల్ పాత ధర రూ.16.90 లక్షలు కాగా లేటెస్ట్ ధర రూ.17.15 లక్షలు. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలే. ఆన్ రోడ్ ధర రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ కూడా ఉంటుంది. (Image courtesy: Manav Sinha/News18.com)
5. టాటా నెక్సాన్ ఈవీలో 30.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో ఒక గంటలో 80 శాతం ఛార్జ్ చేయొచ్చు. రెగ్యులర్ హోమ్ ఛార్జర్‌తో 10 శాతం నుంచి 90 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 8.30 గంటలు పడుతుంది. కస్టమర్లకు ఉచితంగా హోమ్ ఛార్జర్ ఇన్స్టాలేషన్ లభిస్తుంది. 24×7 ఎమర్జెన్సీ సపోర్ట్ కూడా లభిస్తుంది. (Image courtesy: Manav Sinha/News18.com)