1. దేశీయ కార్ల దిగ్గజం టాటా మోటార్స్.. ఈవీ సెగ్మెంట్లో మార్కెట్ పెంచుకోవడంపై దృష్టిసారిస్తోంది. ఇప్పటికే నాలుగు ఎస్‌యూవీలను ఈ లైనప్‌లో తీసుకొచ్చింది. టాటా టియాగో EV, టాటా టిగోర్ EV, టాటా నెక్సాన్ EV ప్రైమ్, టాటా నెక్సాన్ EV మ్యాక్స్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. త్వరలోనే మరో ఎస్యూవీను తీసుకురానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. టాటా పంచ్ ఈవీని సిద్ధం చేయనుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ మైక్రో-ఎస్యూవీ కానుంది. ఈ ప్రాజెక్ట్‌కు కంపెనీ ఇటీవలె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాటా ప్యాసింజర్ అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ టాప్ ఎగ్జిక్యూటివ్ వివేక్ శ్రీవత్స వెల్లడించారు. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ స్టార్ కానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. టాటా పంచ్ ఈవీ పైప్‌లైన్‌లో ఉందని, ఈ విషయం భవిష్యత్తులో ప్రొడక్ట్ లాంచ్‌ను అధికారికంగా నిర్ధారించిందని టాటా ప్యాసింజర్ అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ టాప్ ఎగ్జిక్యూటివ్ వివేక్ శ్రీవత్స పేర్కొన్నారు. అయితే లాంచ్‌కు సంబంధించి టైమ్‌లైన్‌పై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ ప్రొడక్ట్ డెవలప్మెంట్లో ఉందని భావించవచ్చు. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. టాటా పంచ్ ఈవీ 2023 సెకండాఫ్‌లో లాంచ్ కావచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. టాటా ALFA ప్లాట్‌ఫారమ్ బేస్డ్తో టాటా పంచ్ ఈవీ రానుంది. ఇందులో ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఉండే అవకాశం ఉంది. ఈవీ సెగ్మెంట్లోని టాటా పంచ్, టియాగో, టిగోర్ , నెక్సాన్ ట్విన్స్‌లో ఉండే హై-వోల్టేజ్ జిప్ట్రాన్ ఎలక్ట్రిక్ పవర్ట్రైన్ కూడా టాటా పంచ్ ఈవీలో ఉండే అవకాశం ఉంది. దీంతో పవర్‌ట్రెయిన్ ఎంపికలను బట్టి ఈ మోడల్ ధర దాదాపు రూ.10 - 13 లక్షల (ఎక్స్-షోరూమ్)మధ్య ఉండవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. స్మాల్ సెగ్మెంట్లో టాటా టియాగో EV, ఎంట్రీ-లెవల్ టాటా నెక్సాన్ EV ప్రైమ్ మధ్య ఉన్న గ్యాప్‌లో టాటా పంచ్ EV క్లిక్ కావాలంటే టాటా మోటార్స్ లాభదాయకమైన ధరల వ్యూహాన్ని రూపొందించాల్సి ఉంటుంది. టాటా పంచ్ EV భారత్‌లో లాంచ్ అయితే, సిట్రోయెన్ eC3 EV మైక్రో-SUV వంటి వాటితో పోటీ పడాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)