ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (Eledctric Vehicals) హవా కొనసాగుతోంది. టాప్ ఆటోమొబైల్ కంపెనీలు అన్ని సెగ్మెంట్లలో ఈవీలను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో దిగ్గజ ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (TATA Motors).. గత ఏడాది సెప్టెంబర్‌లో టియాగో EV (Tata Tiago EV)ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది.
[caption id="attachment_1532078" align="alignnone" width="1200"] అయితే ఈ ఆఫర్లు తాజాగా ముగిశాయి. ఫిబ్రవరి 10 నుంచి టియాగో EV కొత్త ధరలతో లభిస్తుందని కంపెనీ పేర్కొంది. రీషెడ్యూల్ చేసిన ధరలను సంస్థ ప్రకటించింది. దీంతో ఇప్పుడు EV ధరలు రూ. 8.69 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. అంటే దీనిపై రూ.20,000 వరకు ధర పెరిగింది.
19.2kWh బ్యాటరీ 250km MIDC డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని టాటా మోటార్స్ పేర్కొంది. అయితే దీనికంటే పెద్ద బ్యాటరీ 24kWh మాత్రం 315km MIDC రేంజ్‌ను అందిస్తుందని సంస్థ వెల్లడించింది. టియాగో ఈవీ బ్యాటరీ PMS ఎలక్ట్రిక్ మోటార్‌తో పెయిర్ అయ్యి ఉంటుంది. ఇది 24kWh బ్యాటరీతో 74hp పవర్‌ను, 114Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇది 5.7 సెకన్లలో 60 kmph వేగాన్ని అందుకోగలదు. అయితే 19.2kWh వేరియంట్ 61hp పవర్, 110Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6.2 సెకన్లలో 60 kmph వేగాన్ని అందుకోగలదు. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్, ఎలక్ట్రిక్ ORVMలు, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఆటో హెడ్‌ల్యాంప్స్ వంటి స్పెసిఫికేషన్లతో టియాగో ఈవీ పాపులర్ అయింది.
* పెరిగిన ధరల వివరాలు : - 19.2 kWh బ్యాటరీ వేరియంట్ : ఈ బ్యాటరీ కెపాసిటీతో, 3.3 kW AC చార్జర్ ఆప్షన్‌తో వచ్చే టియాగో ఈవీ XE వేరియంట్ ధర గతంలో రూ.8.49 లక్షలు ఉండగా, ప్రస్తుతం దీని ధర రూ.8.69 లక్షలకు పెరిగింది. ఇవే స్పెసిఫికేషన్లతో లభించే XT వేరియంట్ ధర గతంలో రూ.9.09 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.9.29 లక్షలకు పెరిగింది.
- 24 kWh బ్యాటరీ వేరియంట్ : ఈ బ్యాటరీ కెపాసిటీతో వచ్చే 3.3 kW AC చార్జర్ ఆప్షన్ మోడల్ మొత్తం మూడు ట్రిమ్స్‌లో లభిస్తుంది. వీటిలో XT ట్రిమ్ ధర గతంలో రూ.9.99 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ.10.19 లక్షలకు పెరిగింది. XZ+ ట్రిమ్ ధర రూ.10.79 లక్షల నుంచి రూ.10.99 లక్షలకు, XZ+ Tech LUX ధర రూ.11.29 లక్షల నుంచి రూ.11.49 లక్షలకు చేరుకుంది.