Tata Motors: భారతదేశ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది. సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి మూడు దశాబ్దాల్లో 4 మిలియన్ల (40 లక్షల) ప్యాసింజర్ వాహనాల్ని ఉత్పత్తి చేసింది. 1991లో ప్రారంభమైన టాటా మోటార్స్ తన తొలి వాహనంగా టాటా సియెర్రా SUV మోడల్‌తో ఆటోమొబైల్ మార్కెట్లోకి ప్రవేశించింది. మూడు దశాబ్దాలుగా ఈ కంపెనీ... ఇండికా, సియెర్రా, సుమో, సఫారి, నానో వంటి చాలా మోడళ్లను ఉత్పత్తి చేసింది.
వినియోగదారులు ఎక్కువగా కోరుకునే ఫోర్ వీలర్ SUV వాహనంగా టాటా మోటార్స్... సఫారిని అందుబాటులోకి తెచ్చింది. దీంతో భారత ఆటోమొబైల్ పరిశ్రమకు కొత్త SUV వాహణ శ్రేణిని పరిచయం చేసిన మొదటి కంపెనీగా రికార్డుకెక్కింది. టాటా సుమో లాంచ్‌తో భారత్‌లో మొదటి MPV వాహనాన్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా టాటా మోటార్స్‌కే ఉంది.
దేశంలోనే అతిపెద్ద ఈవీ వాహన తయారీదారుగా రికార్డు: ఈమధ్య కాలంలో టాటా మోటార్స్ వరుసగా టియాగో, నెక్సాన్ రోల్అవుట్ వేరియంట్లను... ఎంట్రీ లెవల్, కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో విడుదల చేసింది. ప్రస్తుతం టాటా మోటార్స్... ఎలక్ట్రిక్ వెహికిల్ వాహన తయారీలో 67 శాతం మార్కెట్ వాల్యూని కలిగి ఉంది. తద్వారా దేశంలోనే అతిపెద్ద ఈవీ వాహన తయారీదారుగా నిలిచింది. అంతేకాక ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రారంభానికి ముందడుగు వేసిన కంపెనీగా నిలిచింది.