జర్మనీ బ్రాండ్ మార్క్ పోలో జెర్సీల సరఫరా కోసం తమకు ఆర్డర్ ఇవ్వగా, ఈ ఆర్డర్ ఇతర ఆర్డర్ల కంటే భిన్నమైనదని ఇండియన్ వెండర్ వార్సా ఇంటర్నేషనల్ యజమాని రాజా షణ్ముగం అన్నారు. గతంలో ఈ బ్రాండ్ ను చైనాలోని తమ ప్రత్యర్థి సంస్థ మార్క్ పోలోకు సరఫరా చేసేదని పేర్కొన్నారు. ఇది తమకు చాలా పెద్ద ఆర్డర్ అని, అంతేకాదు ఇది తమకు ఒక పరీక్ష సమయం అని పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఆర్డర్‌ను నెరవేర్చగలిగితే, అనేక గ్లోబల్ బ్రాండ్లు భారతదేశానికి వస్తాయని షణ్ముగం అన్నారు. ఇదిలా ఉంటే షణ్ముగం తిరుపూర్ ఎగుమతిదారుల సంఘం అధిపతిగా ఉన్నారు. ఈ సీజన్లో సోర్సింగ్‌లో 25% పెరుగుదల ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే తమిళనాడులోని తిరుపూర్ నుండి దుస్తులు ఎగుమతులు 2020 మార్చిలో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ .25 వేల కోట్లకు తగ్గాయి, అంతకుముందు సంవత్సరంలో ఇది 26,000 కోట్ల రూపాయలు కాగా, గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ అమ్మకాలు రూ .25 వేల కోట్లు. నగరంలో 6 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు, అందులో సగం మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉండటం విశేషం.