అక్టోబర్ 1, 2021 నుంచి.. అనగా నేటి నుంచి సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఏటీఎం సేవలు నిలిచిపోనున్నాయి. అక్టోబర్ 1, 2021 నుంచి తమ బ్యాంకు ఏటీఎం సేవలను నిలిపివేస్తున్నట్లు ఆ బ్యాంకు యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే.. తమ సూర్యోదయ్ బ్యాంకు ఏటీఎం కార్డు లేదా డెబిట్ కార్డును వినియోగించుకుని ఇతర బ్యాంకు ఏటీఎంల్లో నగదును విత్డ్రా చేసుకోవచ్చని సదరు బ్యాంకు తమ ఖాతాదారులకు తెలిపింది.