1. గతంలో ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారా జరిగేవి. లేదా వ్యక్తుల మధ్య నేరుగా జరిగేవి. కానీ టెక్నాలజీ సాయంతో ప్రస్తుతం లావాదేవీలన్నీ ఆన్లైన్లో ఈజీగా జరిగిపోతున్నాయి. డిజిటల్ పద్ధతిలో పేమెంట్స్, ట్రాన్సాక్షన్స్ (Digital Transactions) జరిపేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ పేమెంట్స్ ఎంత సులువు అయ్యాయో ఆన్లైన్ మోసాలు (Online Frauds) కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ మోసాల గురించి, ఆ తర్వాతి పరిణామాల గురించి LocalCircles అనే సంస్థ ఓ సర్వే జరిపింది. 42 శాతం మంది భారతీయులు తాము లేదా తమ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు గత మూడేళ్లలో ఆర్థిక మోసానికి బాధితులయ్యారని తెలిపారు. 2021 అక్టోబర్‌లో నిర్వహించిన ఈ సర్వేలో భారతదేశంలోని 301 జిల్లాలకు చెందిన 32,000 మంది పాల్గొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. వీరిలో 43 శాతం మంది టియర్ 1 నగరాల నుంచి కాగా, టియర్ 2 నుంచి 27 శాతం మంది, మిగతా వారంతా టియర్ 3, 4, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 29 శాతం మంది పౌరులు తమ ఏటీఎం లేదా డెబిట్ కార్డ్ పిన్ వివరాలను సన్నిహిత కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నారని సర్వేలో తేలింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక 4 శాతం మంది తమ పనివాళ్లతో లేదా తోటి ఉద్యోగులతో పంచుకుంటున్నట్టు తెలిపారు. 33 శాతం మంది తమ బ్యాంక్ అకౌంట్ వివరాలు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు, ఏటీఎం పాస్వర్డ్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌లను ఇమెయిల్ లేదా కంప్యూటర్లో సేవ్ చేసుకుంటున్నట్టు తెలిపారు. 11 శాతం మంది ఈ వివరాలను మొబైల్ ఫోన్లో సేవ్ చేశామని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. గత మూడేళ్లలో బ్యాంక్ అకౌంట్ మోసాలు, రాత్రికి రాత్రే జెండా పీకేసే ఇ-కామర్స్ ఆపరేటర్స్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మోసాలు పెరిగాయని ఈ సర్వేలో తేలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.60,414 కోట్ల ఆర్థిక మోసాలు జరిగాయి. మైక్రోసాఫ్ట్ 2021 గ్లోబల్ టెక్ సపోర్ట్ స్కామ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం 2021లో ఆన్లైన్ మోసాలు 69 శాతం ఉన్నాయని తేలింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం గత మూడేళ్లలో బ్యాంక్ అకౌంట్ మోసాలు 29 శాతం, ఇ-కామర్స్ మోసాలు 24 శాతం, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మోసాలు 18 శాతం, మొబైల్ యాప్స్ ద్వారా మోసాలు 12 శాతం, ఏటీఎం కార్డు మోసాలు 8 శాతం, ఇన్స్యూరెన్స్ మోసాలు 6 శాతం, ఇతర మోసాలు 21 శాతం జరిగాయని తేలింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. గత మూడేళ్లలో ఆన్లైన్ మోసాలకు గురైనవారిలో కేవలం 17 శాతం మందికే డబ్బులు వెనక్కివచ్చినట్టు తేలింది. 74 శాతం మందికి సమస్య పరిష్కారం కాలేదు. పౌరులు ఎలాంటి ఆర్థిక మోసాలకు పాల్పడ్డా ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ కోరుతోంది. కంప్యూటర్, మొబైల్, ఇమెయిల్‌కు కఠినమైన పాస్వర్డ్ సెట్ చేయాలని ఆర్బీఐ సూచించింది. తరచూ పాస్వర్డ్ మార్చాలని కోరింది. (ప్రతీకాత్మక చిత్రం)