Summer Special Trains: హైదరాబాద్, కాకినాడ నుంచి తిరుపతికి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?
Summer Special Trains: హైదరాబాద్, కాకినాడ నుంచి తిరుపతికి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?
వేసవి సెలవుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్, కాకినాడ టౌన్ నుంచి తిరుపతికి పలు స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07433: హైదరాబాద్ నుంచి తిరుపతికి ఈ నెల 17న స్పెషల్ ట్రైన్ ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 18.40 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 07:50 గంటలకు గమ్యానికి చేరుతుంది.
2/ 6
Train No.07434: తిరుపతి-హైదరాబాద్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 19న ప్రకటించారు. ఈ ట్రైన్ 20.25 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 08:30 గంటలకు గమ్యానికి చేరుతుంది.
3/ 6
Train No.07435: తిరుపతి-కాకినాడ టౌన్ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 18న ప్రకటించారు. ఈ ట్రైన్ 16.15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 04.00 గంటలకు గమ్యానికి చేరుతుంది.
4/ 6
Train No.07436: కాకినాడ టౌన్-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 19న ప్రకటించారు. ఈ ట్రైన్ 07.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 18.40 గంటలకు గమ్యానికి చేరుతుంది.
5/ 6
హైదరాబాద్-తిరుపతి-హైదరాబాద్ స్పెషల్ ట్రైన్స్ సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడె, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట తదితర స్టేషన్లలో ఆగుతుందిని అధికారులు తెలిపారు.
6/ 6
తిరుపతి-కాకినాడ టౌన్-తిరుపతి స్పెషల్ ట్రైన్స్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సమార్లకోట లో ఆగుతుందని అధికారులు వెల్లడించారు.