1. డబ్బు పొదుపు చేయాలన్న ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ ఎప్పుడు మొదలుపెట్టాలో, ఎలా మొదలుపెట్టాలో తెలియక ఆలోచిస్తుంటారు. ఇలా ఆలోచిస్తూనే రోజులు గడిచిపోతాయి. పొదుపు చేయడానికి భారీ మొత్తంలో కావాలని అనుకుంటారు కానీ... తక్కువ డబ్బుతో కూడా పొదుపు ప్రారంభించవచ్చు. రోజూ టీ, కాఫీల కోసం బయట ఎంత ఖర్చు చేస్తారో అంత పొదుపు చేసినా చాలు. లక్షల రూపాయల రిటర్న్స్ వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇలా మంచి రిటర్న్స్ ఇచ్చే పొదుపు పథకాలు (Savings Schemes) చాలా ఉన్నాయి. ఇండియా పోస్ట్ అనేక పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్‌ని (Post Office Schemes) అందిస్తోంది. అలాంటి పథకాల్లో సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ (Sumangal Rural Postal Life Insurance Scheme) కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో రోజూ రూ.95 చొప్పున పొదుపు చేస్తే రూ.13 లక్షల పైనే రిటర్న్స్ వస్తాయి. ఎలాగో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ వివరాలు చూస్తే మీకు దగ్గర్లో ఉన్న ఏ పోస్ట్ ఆఫీసులో ఈ స్కీమ్‌లో చేరొచ్చు. 19 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు ఈ పథకంలో చేరొచ్చు. రూ.10 లక్షల సమ్ ఇన్స్యూర్డ్తో ఈ పాలసీ తీసుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో పాలసీహోల్డర్ మరణిస్తే నామినీకి పాలసీడబ్బులతో పాటు బోనస్ డబ్బులు కూడా వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ పాలసీలో 15 ఏళ్లు, 20 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఇది మనీ బ్యాక్ పాలసీ కాబట్టి పాలసీ మధ్యలోనే డబ్బులు వస్తాయి. పాలసీహోల్డర్ 15 ఏళ్ల పాలసీ తీసుకుంటే 6 ఏళ్లు, 9 ఏళ్లు, 12 ఏళ్లు పూర్తైన తర్వాత, 20 ఏళ్ల పాలసీ తీసుకుంటే 8 ఏళ్లు, 12 ఏళ్లు, 16 ఏళ్లు, 20 ఏళ్లు పూర్తైన తర్వాత కొంత మనీబ్యాక్ వస్తుంది. మిగతా 40 శాతం మెచ్యూరిటీ సమయంలో బోనస్‌తో కలిపి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)