కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్‌లో సుకన్య సమృద్ధి యోజన (SSY) పాపులర్ అయింది. ఆడపిల్లలకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. బాలికలకు పదేళ్ల లోపు వయసు ఉన్నప్పుడు వారి పేరుతో సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన రోజు నుంచి.. ఇందులో నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన 15 సంవత్సరాల పాటు డిపాజిట్లు చేయవచ్చు.
* మారని వడ్డీ రేటు : 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో SSY అకౌంట్ వడ్డీ రేటును 8.4 శాతం నుంచి 7.6 శాతానికి తగ్గించారు. ఆ సమయంలో PPF వడ్డీ రేటును కూడా 7.9% నుంచి 7.1 శాతానికి తగ్గించారు. ఆ తర్వాత నుంచి సుకన్య వడ్డీరేటు 7.6 శాతంగానే ఉంటోంది. 2022 డిసెంబర్లో డిపాజిటర్లకు పన్ను ప్రయోజనాలను అందించని కొన్ని చిన్న సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను ప్రభుత్వం సవరించింది. అయితే SSY, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి ప్రముఖ పథకాల వడ్డీ రేట్లను మాత్రం మార్చలేదు.
SSY వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేనప్పటికీ, పన్ను మినహాయింపు ప్రయోజనాల కారణంగా ఇది ఇప్పటికీ బెస్ట్ సేవింగ్స్ స్కీమ్స్‌లో ఒకటిగా ఉంది. SSY అకౌంట్లో కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, ఈ మొత్తం కాంట్రిబ్యూషన్‌పై పన్ను మినహాయింపు పొందవచ్చు.