1. బ్యాంకులు ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్లపై (Fixed Deposits) అందించే వడ్డీ రేట్లను (Interest) పెంచాయి. ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇంతకముందు కంటే కొంచెం ఎక్కువ రాబడి లభిస్తోంది. అయినప్పటికీ చిన్న పొదుపు పథకాలు (Small Savings Scheme) మరింత ఆకర్షణీయంగా ఆదాయాన్ని అందిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. సుకన్య సమృద్ధి యోజన పథకంపై వడ్డీ రేటును త్రైమాసిక ప్రాతిపదికన సమీక్షిస్తారు. కేంద్రం ఇటీవల 2022 అక్టోబర్- డిసెంబర్ వడ్డీ రేటును 7.6 శాతంగానే ఉంచింది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి ఎలాంటి నష్టభయాలు ఉండవు. స్థిరమైన రాబడి అందుతుంది. ఇందులో నెలకు రూ.500 చొప్పున ఇన్వెస్ట్ చేసి రూ.2.5 లక్షల రిటర్న్స్ అందుకోవచ్చు. ఈ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
5. కవలలు/ముగ్గురు ఆడపిల్లలు పుడితే రెండు కంటే ఎక్కువ అకౌంట్లు ఓపెన్ చేసుకొనే అవకాశం ఉంది. ఈ అకౌంట్ సేవలను ఏదైనా బ్యాంక్ లేదా పోస్టాఫీసులో పొందవచ్చు. ఇతర బ్యాంక్ శాఖలు లేదా పోస్టాఫీసులకు సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి కాలం 15 సంవత్సరాలుగా ఉంది. 21 సంవత్సరాలకు మెచ్యూరిటీ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. సుకన్య సమృద్ధి యోజన పథకంలో కనీస ప్రారంభ డిపాజిట్ రూ.250గా ఉంది. ఇందులో ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ.50 మల్టిపుల్స్‌లో ఉండాలి. డిపాజిట్ ఒకే సారి చేయవచ్చు లేదా నెలవారీ ప్రాతిపదికన చెల్లించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. సుకన్య సమృద్ధి అకౌంట్‌ను రూ.250తో ఓపెన్ చేసి, మొదటి నెలకు రూ.250 చెల్లించాలి. ఆ తర్వాత ప్రతినెలా రూ.500 డిపాజిట్ చేయాలి. ఇలా సంవత్సరానికి చేసిన డిపాజిట్ మొత్తం రూ.6,000 అవుతుంది. కుమార్తెకు ఏడాది వయసున్నప్పుడు అకౌంట్ ఓపెన్ చేస్తే .. ఆమెకు 22 ఏళ్లు వచ్చే సమయానికి పెట్టుబడి రూ.90,000 అవుతుంది. దీనిపై రూ.1,64,606 వడ్డీ అందుతుంది. మొత్తంగా మెచ్యూరిటీ సమయానికి రూ.2,54,606 చేతికి అందుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9. సుకన్య సమృద్ధి అకౌంట్లో డిపాజిట్ చేసిన మొత్తానికి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ట్యాక్స్ డిడక్షన్స్ లభిస్తాయి. అదే విధంగా సుకన్య సమృద్ధి అకౌంట్లో సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. అకౌంట్లోని మొత్తంపై వార్షికంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్‌పై వచ్చే ఆదాయానికి కూడా ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం ట్యాక్స్ ఎగ్జమ్షన్ లభిస్తుంది. మెచ్యూరిటీ/విత్‌డ్రాపై వచ్చే ఆదాయం కూడా ఆదాయపు పన్ను మినహాయింపు పొందుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)